VCs in Universities: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు విశ్వ విద్యాలయాలకు ఇన్ఛార్జ్ వీసీలను ప్రభుత్వం నియామించింది. ఈ సందర్భంగా ఓ జాబితాను ఏపీ సర్కార్ విడుదల చేసింది.
ఢిల్లీ పర్యటనలో రెండో రోజు పలువురు కేంద్ర మంత్రులను ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కలిశారు. జౌళి శాఖా మంత్రి గిరిరాజ్ సింగ్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఈ సందర్భంగా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వివరించారు.
Gudivada Amarnath: టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన దాడులు, హత్యలపై ముందుగా శ్వేతపత్రం విడుదల చేయ్యాలని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోంది.. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయ్యింది..
Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను ఆగష్టు 15 తేదీన ప్రారంభిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. 2. 25 లక్షల మంది అన్నార్తుల ఆకలి తీర్చేలా వీటిని మొదలు పెడుతున్నాం.. మొత్తం 203 క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.. గత ప్రభుత్వ హాయంలో అన్నిటినీ గోదాములుగా, సచివాలయాలుగా, బ్లీచింగ్ నిల్వ కేంద్రాలుగా వాడుకున్నారు.
Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసు అని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కొన్ని అరాచక శక్తులు మా ప్రభుత్వ హయాంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
Kakani Govardhan Reddy: గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లపై టీడీపీ నేతల దాడులు తీవ్రమవుతున్నాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. రషీద్ ను దారుణంగా హతమార్చారు.. అంతరంగిక వివాదాల వల్లే హత్య జరిగిందని ఎస్పీ చెప్పారు.. ఇది పద్దతి కాదు.. కొందరు టీడీపీ నేతలు మాత్రం ఇద్దరూ వైసీపీకి చెందిన వారేనని ప్రచారం చేశారు