AP Assembly Sessions: మూడో రోజు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. విశాఖలో కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలపై ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ ప్రశ్న వేయగా.. దానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తూ.. ధూళి కణాల పొల్యూషన్ ఎక్కువగా ఉందన్నారు.
YS Jagan Protest: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంది. ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయనున్నారు.
AP Assembly: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్న ఎన్డీయే కూటమి సర్కార్ ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాల చిట్టాను విప్పేందుకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు మద్యం అక్రమాలపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో విడుదల చేయనున్నారు.
అతి భారీ వర్షాలు ఏజెన్సీ వ్యాప్తంగా కురుస్తున్నాయి. ఏజెన్సీలో వాగులు, గెడ్డల ఉధృతి కొనసాగుతుంది. గత వారం రోజులుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వందలాది గిరిజన గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.