శ్రీవాణి ట్రస్ట్ అంటే.. తెలియని వారుండరు. అలాంటిది.. టీటీడీకి మంచి ఆదాయ వనరుగా మారింది. ఇక శ్రీవారి భక్తులుకు కూడా ఉపయోగకరంగా వుండడంతో భక్తులు నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా 10 వేలు రూపాయులు ట్రస్ట్ కి చెల్లిస్తే చాలు. ప్రోటోకాల్ దర్శనాన్ని భక్తులుకు కల్పిస్తుంది. దీంతో శ్రీవాణి ట్రస్ట్‌కి నెలకు దాదాపు 30 కోట్లు పైగానే ఆదాయం లభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటించనున్నారు.. ఉదయం 9 గంటలకు రెండు జిల్లాల పర్యటనలకు బయల్దేరనున్నారు సీఎం చంద్రబాబు. నేడు శ్రీశైలం రానున్నారు.. సీఎం చంద్రబాబు. ఉదయం 10:30కి సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10:50కి శ్రీమల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి.. కృష్ణానదికి జలహారతి సమర్పిస్తారు.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. రూ. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. నాలుగు నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చినందున పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి మరికొంత సమయం అవసరం అని గెజిట్‌లో గవర్నర్ పేర్కొన్నారు.
“తల్లి పాలివ్వడాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలను బలోపేతం చేయడానికి, ప్రతి ఏడాది ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా "అంతరాలు లేకుండా అందరికీ తల్లిపాల మద్దతు" అనే థీమ్‌తో నిర్వహిస్తున్నామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు.
పెద్దలకు టీబీ బీసీజి టీకాలు వేయడంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఈ టీకాలు వేసినప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ గుర్తింపు సంఖ్యను కూడా ఏఎన్ఎంలు క్రియేట్ చేయాలన్నారు. మంగళగిరి ఏపీఐఐసీ టవర్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం జాతీయ టీబీ నిర్మూలనా కార్యక్రమంపై సమీక్షించారు.
ఏపీ మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై చర్చించారు. మైనింగ్ శాఖ ఆదాయం 2014-19 మధ్య 24 శాతం గ్రోత్ సాధించగా.. 2019-24 మధ్య 7 శాతం మాత్రమే ఉందని నిర్ధారించారు.