Kesineni Chinni: ఇవాళ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు కర్నూల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల రోజుల్లో ఏసీఏలో ఎన్నికలు జరుగుతాయన్నారు.
Nadendla Manohar:పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్ల, గృహ నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నారు. ఇక, దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తాం.. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లకు రెండు వారాల గడువు ఇస్తున్నామన్నారు. పనులు మొదలు పెట్టకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోంది అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఈ రెండు నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారు పేరుగా మారిపోయింది అన్నారు.
AP Govt: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే హౌసింగ్ అక్రమాలపై ప్రభుత్వానికి అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు.
Anam Ramanarayana Reddy: నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మున్సిపల్ కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండు కుండలా మారాయి అన్నారు. ఇక, మూడు నధుల అనుసంధానం జరిగితే మెట్ట ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.
విశాఖలోని బీచ్ రోడ్డులో హ్యాండ్లూం శారీ వాక్ కలర్ఫుల్గా జరిగింది. సూర్యోదయం కాగానే వేలాది మహిళలతో చేపట్టిన శారీ వాక్ సంప్రదాయాలను చాటి చెప్పింది. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొన్నారు. ఈ శారీ వాక్‌ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. మంత్రి కూడా వైజాగ్ మహిళలతో కలిసి శారీ వాక్ చేశారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. నర్సుగా పని చేస్తున్న కావ్య(23) అనే యువతిపై బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కావ్యకు గాయాలు అయ్యాయి.