సీఎం, డిప్యూటీ సీఎంలే కాదు.. క్షేత్ర స్థాయిలో పని చేసే వాళ్ల వల్ల కూడా ప్రభుత్వ పనితీరును ప్రజలు అంచనా వేస్తారు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సచివాలయం వేదికగా జరుగుతోన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. ఇక, ప్రతి మూడు నెలలకొసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తాం.. ప్రజలను సంతృప్తి పరిచేలా పాలన చేయాలన్నారు.. ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం పాలన ప్రారంభించింది. ఏపీ బ్రాండ్ దెబ్బ తీసే విధంగా గత పాలకులు వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది.. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి కలెక్టర్ల సమావేశం ఇదే.. ఈ భేటీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.. 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఇవ్వడానికి సిద్ధమైంది సర్కార్.. ప్రభుత్వ ప్రాధాన్యతలను కలెక్టర్లకు వివరించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
గృహ నిర్మాణం పేరిట కేంద్ర నిధులు దుర్వినియోగమయ్యాయా.. అంటే అవుననే అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీ హౌసింగ్ శాఖలో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను అధికారులు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించారు. గృహ నిర్మాణ శాఖలో అవకతవకలు జరిగాయని ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అవినీతిపై విచారణ చేపడతామని అప్పట్లోనే హెచ్చరించారు. అధికారంలోకి రావడంతో.. హౌసింగ్ శాఖలో జరిగిన అవకతవకలు,…
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు వరుస సమీక్షలతో బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 వరకు శాఖల వారీగా అధికారులతో సమావేశం కానున్నారు. ఉదయం పది గంటలకు కలెక్టర్లతో భేటీ కానున్నారు. కలెక్టర్ల సదస్సులో ప్రారంభోత్సవం చేయనున్నారు సీసీఎల్ఏ జయలక్ష్మి, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. కలెక్టర్లను ఉద్దేశించి సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడనున్నారు.