రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉండే సంస్కృతి ఏపీకి తెచ్చారని తీవ్రంగా విమర్శించారు. రోజు రోజుకీ రాష్ట్రంలో ప్రేరేపిత హింస రెట్టింపు అవుతుందని ఆరోపించారు.
వెలగపూడిలోని సచివాలయంలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. వివిధ సంక్షేమ శాఖలపై ఆయా శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సివిల్ సప్లైస్ శాఖ సమీక్ష ప్రారంభించే ముందు కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఆసక్తికర సంభాషణ జరిగింది. చాలా దూరంగా కూర్చున్నావ్.. ప్రత్యేకంగా సీటు వేయాలా..? అంటూ ఆ శాఖ కార్యదర్శి సిద్దార్ధ్ జైన్ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కామెంట్ చేశారు.
ఏపీ యువతకు గ్లోబల్ స్థాయి ఉద్యోగాలు లభించేలా నైపుణ్యాభివృద్ధి పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిపై కలెక్టర్ల సదస్సులో చర్చించారు. ఆ శాఖ కార్యదర్శులు కోన శశిధర్, సౌరభ్ గౌర్ ఈ సదస్సులో వివరించారు.
రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం పోర్టుల నిర్మాణాన్ని ఈపీసీ పద్దతుల్లో చేపట్టిందని చంద్రబాబు అన్నారు.పోర్టులను నిర్మించే కంపెనీలకు ప్రభుత్వం గ్యారెంటీలు ఎక్కడ ఇవ్వగలదని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలోని ఇసుక అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఉచిత ఇసుక విధానం, తాగునీటి విషయాల్లో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.
కలెక్టర్ట కాన్ఫరెన్స్లో వివిధ శాఖల అధికారులకు చురకలు అంటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాంతిలాల్ దండేకు క్లాస్ తీసుకున్నారు సీఎం చంద్రబాబు. దండే ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కొన్ని అంశాలు ప్రస్తావించ లేదన్న సీఎం.. ఏపీలో మొత్తం 12 వేల కిలోమీటర్ల మేర స్టేట్ హైవేస్ ఉంటే.. 1000 కిలో మీటర్ల పీపీపీ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు దండే పేర్కొనడంపై స్పందిస్తూ.. 1000 కిలో మీటర్లు ఏ మూలకు సరిపోవన్నారు చంద్రబాబు.
భారీ ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాలి. ఒకేసారి ఐదు లక్షలు.. పది లక్షల చెట్లు నాటేలా వన మహోత్సవాలను కార్యక్రమం చేపట్టాలి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
ఏపీ సచివాలయం వేదికగా జరుగుతోన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇకపై ప్రతీ మూడు నెలలకు ఓసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్న ఆయన.. అధికారుల బాధ్యతలను గుర్తు చేస్తూ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు.. పొలిటికల్ గవర్నెన్సే ఉంటుందని కలెక్టర్లకు స్పష్టం చేశారు.