నంద్యాల జిల్లా, చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో అర్థరాత్రి సమయంలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. ఈ ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు.. బాలికకు అండగా ఉంటానని ప్రకటించారు..
గత ప్రభుత్వ నాసిరకమైన విధానాల వల్ల విద్యుత్ వ్యవస్థ అతలాకుతలమైంది.. విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. గత ప్రభుత్వం విద్యుత్ అడ్డగోలుగా కొనుగోలు చేసి చార్జీలు పెంచి ప్రజల మీద భారం వేసిందని ఫైర్ అయ్యారు.
అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కావాలంటే సాధ్యం కాదు అన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఇదే సమయంలో.. ప్రైవేటు సంస్థలలో రాణించాలంటే.. నైపుణ్య శిక్షణ చాలా అవసరం అన్నారు.. యాభై రోజుల పాలనలో ఇంకా నేను నేర్చుకునే పనిలోనే ఉన్నాను.. ఎన్నో సాదక బాధకాలు తెలుసుకుంటూ వాటిపై అవగాహన పెంచుకుంటున్నాను అన్నారు..
చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. ఈ రోజు మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో అప్కాబ్ సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించారు మంత్రి అచ్చెన్నాయుడు
వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై గెజిట్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.. వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకిగా పునరుద్ధరిస్తూ గెజిట్ విడుదల చేశారు.. ఇకపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుతో కార్యకలాపాలు సాగించనుంది హెల్త్ యూనివర్శిటీ యాజమాన్యం.
పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వినతులు ఎన్ని ఉన్నా... అన్నింటి పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నాయన.. గత ఐదేళ్ల కాలంలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. రెవెన్యూ సమస్యలకు కారణమై, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు..
గుంటూరులో పశ్చిమ తహసీల్దార్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ప్రభుత్వ శాఖకు సంబంధించిన ఫైల్స్ రోడ్డుపక్కన చెత్తుకుప్ప దగ్గర ప్రత్యక్షం అయ్యాయి.. పోలీస్ శాఖ లేక రెవెన్యూ అధికారులకు సంబంధించినవా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమరావతి రాజధాని ప్రాంతంలో ఐఐటీ నిపుణుల బృందం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.. ఐకానిక్ భవన నిర్మాణ ప్రాంతాలను సందర్శించారు ఐఐటీ నిపుణులు. గత ఐదేళ్ల ప్రభుత్వ నిర్లక్యం వల్ల ఐకానిక్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి.. పునాదులు వేసింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. గత ఐదేళ్లూ పునాదుల్లో నీళ్లు చేరి చెరువును తలపిస్తోంది ఐకానిక్ సెక్రటేరీయేట్, హెచ్‌వోడీల నిర్మాణ ప్రాంగణం