వదర ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు చేపడుతున్నసహాయక చర్యలు.. మరోవైపు భారీ వర్షాలు ఉన్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.. మరోవైపు.. బుడమేరు వరద నీటి ప్రభావం కొంత మేరకు తగ్గింది. ఈ రోజు సాయంత్రానికి దాదాపు అన్ని…
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. పార్టీ మారుతున్నారంటూ ఎప్పటి నుంచో ప్రచారం సాగుతూ వస్తుంది.. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే.. మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరతారనే చర్చ సాగింది.. అయితే, ఆయన ఎప్పటికప్పుడు ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చారు.. తాజాగా మరోసారి తిరుమల వేదికగా క్లారిటీ ఇచ్చారు..
ఒక పక్క వరదలు, మరో వైపు వర్షాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాలు అతలాకుతలం అయ్యాయి. చింతూరు ఏజన్సీలో గత రెండువరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్కన శబరి, మరోవైపు గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనికి తోడు పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో జన జీవనం అస్త వ్యస్థంగా మారింది.
కృష్ణా నదిలో బోట్లు వచ్చి.. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం సంచలనంగా మారింది.. ఈ బోట్లు సృష్టించిన విధ్వంసంతో .. ప్రకాశం బ్యారేజీకి చెందిన 67, 69, 70 గేట్లు దెబ్బతిన్నాయి.. దీని కోసం ఆ గేట్లను కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.. ఇంకో వైపు ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీ-కొన్న ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక చేరింది.. బ్యారేజీకి బోట్లు ఢీకొన్న సంఘటనలో కుట్ర కోణం…
ప్రకాశం బ్యారేజీపై కౌంటర్ వెయిట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.. హైదరాబాద్ నుంచి తెప్పించిన కౌంటర్ వెయిట్ లు ప్రకాశం బ్యారేజీ 67 ,69 గేట్లకు బిగిస్తున్నారు... గడిచిన వారం రోజులుగా వరదల నేపథ్యంలో, ఇసుకతో నిండిన పడవలు ప్రకాశం బ్యారేజీను ఢీకొట్టడం, బ్యారేజీకి సంబంధించిన కౌంటర్ వెయిట్ లు దెబ్బ తినటం, వంటి అంశాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది..
వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవగా జలాశయాలు నిండుకుండలా మారాయి.. ఏజెన్సీలో వాగులు గడ్డలు ఉప్పొంగాయి.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని అప్రమత్తంగా ఉండాలని, వాగులు గడ్డలు దాటే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
ఆక్రమణలు తొలగించేలా పటిష్ట చట్టం తెస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా.. బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని పేర్కొన్నారు.
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని.. రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.