కుక్కులు మొరగడం .. అతడి వెంట పడడం.. దానికితోడు హిందీ మాట్లాడుతుండంతో.. యువకుడిని దొంగగా భావించి గ్రామస్థులు పట్టుకుని కట్టేసిన ఘటన సోమందేపల్లి మండలం చాకర్లపల్లిలో చోటు చేసుకుంది.. గ్రామానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టిన తరువాత అసలు విషయం వెలుగుచూసింది.
ఇవాళ్టి నుంచి ఏపీలో ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమల్లోకి రాబోతోంది.. ఉచిత ఇసుక పోర్టల్‌ను ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.. అధికారులు నుంచి ఇసుక రవాణాదారుల ఎవ్వరూ తప్పిదాలకు పాల్పడకుండా పోర్టల్ రూపకల్పనకు పూనుకుంది సర్కార్.
రూరల్ వాటర్ సప్లై, జల్ జీవన్ మిషన్ పై ఈ రోజు సమీక్ష నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇంటింటికీ కుళాయి నీరు అందించే అంశంపై చర్చించనున్నారు.. కేంద్ర నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఇంటింటికీ తాగు నీరు అందించేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది..
ఆగస్టు 15వ తేదీన తొలి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించిన చంద్రబాబుసర్కార్.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు సిద్ధమైంది.. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రెండో విడత అన్న క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. సెక్రటేరీయేట్ వద్దనున్న అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అడుగులు జనసేన పార్టీ వైపు పడుతున్నాయి.. ఇప్పటికే తన రాజీనామా లేఖలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పంపిన బాలినేని.. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు.. ఇక, జనసేన పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లారు బాలినేని.. ఇక, ఈ రోజు విజయవాడలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారు బాలినేని.. ఇప్పటికే జనసేన కీలక నేత నాగబాబుతో మంతనాలు…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో స్పందించితన దాతలు, ప్రముఖులు, పారిశ్రామిక, వ్యాపార, విద్యా, వాణిజ్య సంస్థలకు చెందిన వారు ఈరోజు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి విరాళాలు అందించారు. వరద బాధితులకు సాయం అందించడానికి ముందుకొచ్చిన దాతలను అభినందనలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు..
విజయవాడలో గురువారం రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలుస్తానని బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. తన భవిష్యత్ కార్యాచరణను కూడా అక్కడే ప్రకటిస్తానన్నారు. గతంలో తాను పార్టీలోని కొందరు వ్యక్తుల వల్ల పడుతున్న ఇబ్బందులు పలు సందర్బాల్లో ప్రస్తావించిన బాలినేని.. పార్టీలో తనకు జరిగిన అన్యాయాలను త్వరలో వివరిస్తానని తెలిపారు.