ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. గత పాలక మండలి హయాంలో తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన అంశంపై వివరాలు తెలియజేశారు.
టీటీడీ లడ్డూ ప్రసాదం మీద ఆరోపణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దాడులు చేయటం ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
Anil Kumar Yadav: నెల్లూరు సిటీ నియోజకవర్గ కార్యకర్తలతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా కార్యకర్తల జోలికొస్తే మూడింతలుగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని వార్నింగ్ ఇచ్చారు.
అత్యంత పెద్దదైన భారతదేశానికి ఒకేసారి ఎన్నిక ఎలా కుదురుతుందా అని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ప్రజాస్వామ్యం ఉండకూడదని.. అధ్యక్ష తరహా పాలన కోసమే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక.. దేశం ఐక్యంగా ఉండదు.. ఒకే దేశం ఒకే ఎన్నిక వాదన.. సీతారాం ఏచూరి మార్క్సిస్ట్ పార్టీని దేశంలో అభివృద్ధి చేసారు..
Chelluboina Venugopal: వంద రోజులు కూటమి పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మంచి ప్రభుత్వం కాదు ముంచిన ప్రభుత్వం.. చంద్రబాబు రోజుకోక డైవర్షన్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు.
Pawan Kalyan: ఇవాళ్టి నుంచి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదలు పెట్టారు. తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రం కావడంతో దీక్ష చేపట్టినట్లు తెలిపారు. దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేపట్టి దీక్షను డిప్యూటీ సీఎం ప్రారంభించారు.
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 25 కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం కోసం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనానికి కేవలం 8 గంటల సమయం మాత్రమే పడుతుంది.
నేటి (ఆదివారం) నుంచి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయబోతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నారు.