Divvala Madhuri: మాది పవిత్రబంధం.. అదంతా రాజకీయ కుట్రే..!
- మాది అపవిత్రబంధం కాదు.. పవిత్రబంధం..
- విడాకులు తీసుకున్నాక ఇద్దరం కలసి ఉంటాం..
- కొండమీద రీల్స్ చేయలేదు.. ఒక్కఫొటో అయినా ఉందా..?
- నేను ఫొటోగ్రాపర్స్ ని తీసుకువెళ్లలేదన్దన దివ్వెల మాధురి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divvala Madhuri: మాది అపవిత్రబంధం కాదు.. పవిత్రబంధం.. విడాకులు తీసుకున్నాక ఇద్దరం కలసి ఉంటాం అంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి.. తాజాగా, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈ జంట.. అక్కడ ఫొటోలు, వీడియోలకు పోజులు ఇవ్వడం చర్చగా మారింది.. అదే వివాదాలు తెచ్చిపెట్టింది.. దివ్వెల మాధురిపై తిరుమలలో కేసు నమోదైంది. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమెపై తిరుమల వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ సందర్భంగా ఎన్టీవీ ప్రత్యేకంగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిని ప్రశ్నించింది.. కానీ, కొండమీద రీల్స్ చేయలేదు. ఒక్కఫొటో అయినా ఉందా..? నేను ఫొటోగ్రాపర్స్ ని తీసుకువెళ్లలేదన్నారు మాధురి.. వద్దని చెబుతున్నా.. కొందరు నా వెంటపడి వీడియోలు, ఫొటోలు తీశారన్నారు.. అయితే, మాది అపవిత్ర బంధం కాదు.. పవిత్రబంధంగా చెప్పుకొచ్చారు..
Read Also: MS Dhoni New Haircut: వారెవ్వా.. కుర్రాడిలా మారిపోయిన ఎంఎస్ ధోనీ..
Also Read
- Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
- Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
ఇక, కార్యకర్తలం అందరం కలసి తిరుమల దర్శనానికి వెళ్లాం.. ఏడు , ఎనిమిది , తోమ్మిది తేదీలలో నా మీద ఎందుకు కేసులు పెట్టలేదు అని ప్రశ్నించారు దివ్వెల మాధురి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వాఖ్యలు చేసిన తరువాతనే 10వ తేదీన కేసు నమెదు చేశారని విమర్శించారు.. రాజకీయ కుట్రలో బాగంగానే కేసులు పెట్టారని ఆరోపించారు.. మెన్నటి వరకూ లడ్డూ అన్నారు. నేడు మాధురి మాడవీదిలో తిరిగిందంటున్నారు. దేవుడిని రాజకీయంగా లాగవద్దు. కొండమీద మాటాడకూడదని తెలియదు. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాం. గతంలోనూ మాడవీదులు తిరిగాను , నాట్యం చేశాను అన్నారు. అయితే, తనపై నమోదైన కేసులో న్యాయపరంగా అన్ని కేసులు ఎదుర్కుంటాను అన్నారు.. దువ్వాడ పై ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా దువ్వాడను ఎవరూ ఏం చేయలేరు. ఇండిపెండెంట్ గా పోటీచేసినా గెలుస్తారు. టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ను ఎదిరించే వారు ఎవరూ లేరన్నారు..
Read Also: Minister Ramprasad Reddy: వ్యాపారులను వేధిస్తే సహించేది లేదు..
ఇంటిలో ప్రేమ , ఆప్యాయత కోల్పోయారు. దువ్వాడకు మేం తోడుగా ఉంటాం అన్నారు మాధురి.. అందరి దృష్టిలో దువ్వాడ శ్రీనివాస్ ఏజ్ 58.. నాదృష్టిలో అతను 30 ఏజ్.. ఈ జనరేషన్ తో కాకుండా ముందు ఉంటారు. దువ్వాడ దగ్గర నేర్చుకునేందుకు చాలా ఉంది. ఏజ్ నాట్ ఎ ప్యాక్టర్.. దువ్వాడ ప్రతి అడుగులో నేను వెనకుండి నడిపిస్తాను. దువ్వాడను మంత్రిగా చూడాలన్నది నా కళ అన్నారు దెవ్వెల మాధురి.. ప్రజాజీవితంలో మేం ఉంటాం.. నేడు అడుగుపెట్టిన తరువాతనే టిక్కెట్ వచ్చింది. రాజకీయాలు నాకు ఇష్టమే కానీ దువ్వాడ వద్ద ఓనమాలు నేర్చుకుంటాను అన్నారు మాధురి.. నా భర్త బోస్ కు విడాకులు ఇస్తాను. మాది పవిత్రబంధం.. విడాకులు తీసుకున్నాక ఇద్దరం కలసి ఉంటాం అన్నారు.. నేనేమైనా అంటరాని దాన్నా.. నేను తిరుమలకు రావొద్దా..? అని ప్రశ్నించారు హనీ ట్రాప్ లో ఇరుక్కున్న జత్వానికి ప్రోటోకాల్ ఎలా ఇచ్చారు. అని ప్రశ్నించారు దివ్వెల మాధురి..
తాజావార్తలు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!