Nandigam Suresh: అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ హత్య కేసులో తనకు రెగ్యులర్ బెయిలు మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ మాజీ పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ బుధవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Chandrababu- Pawan: నేడు హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నారు. వీరు ఎన్డీయే కూటమిలో భాగమైనందున హర్యానాకు వెళ్తున్నారు.
AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటక ముందే వాయుగుండం బలహీనపడింది. ఇక, నెల్లూరు జిల్లా తడ సమీపంలో తీరం దాటిన దాటిన వాయుగుండం..
వరద బాధితులకు సహాయం కోసం పలువురు దాతలు విరాళాలు అందించి దాతృత్వం చాటుకుంటున్నారు. సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి దాతలు చెక్కులు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో పలువురు దాతలు, ప్రముఖులు, పారిశ్రామిక, వ్యాపార, విద్యా, వాణిజ్య సంస్థలకు చెందిన వారు తమ వంతు సాయంగా విరాళంగా అందించారు.
రాష్ట్ర అభివృద్ధికి ఆరు నూతన పాలసీలు రూపొందించామని.. ఈ నూతన పాలసీలతో ఒక గేమ్ ఛేంజర్గా ఏపీ అభివృద్ధి మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నూతన పారిశ్రామిక విధానం 4.0, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0, ఏపీ గ్రీన్ ఎనర్జీ 4.0, టూరిజం, ఐటీ విధానాలలో పాటు అనేక కొత్త పాలసీలు తీసుకొచ్చారు.
వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రామన్న చెరువు కట్ట తెగింది. దీంతో.. 216వ నంబర్ ఒంగోలు, దిగమర్రు జాతీయ రహదారి పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. జాతీయ రహదారిపై దాదాపు అర కిలోమీటర్ మేర.. రోడ్డుపై దాదాపు మూడు అడుగుల వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో.. జాతీయ రహదారిపై వెళ్ళే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
Weather Update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేయగా.. ప్రకాశం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రంలో పునరుద్పాదక విద్యుత్, పంప్డ్ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ లాంటి వనరుల వినియోగం పెంచేలా ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, 2024-29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0పై చర్చించిన మంత్రివర్గం ఆమోదించింది.