నంద్యాల జిల్లా డోన్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. క్రిప్టో కరెన్సీ పేరుతో రామాంజనేయులు అనే మోసగాడు సుమారు రూ. 25 కోట్లు వసూలు చేశాడు. బైనాన్స్, ఒకే-ఎక్స్ యాప్స్‌లో ట్రేడింగ్ చేస్తూ, లక్ష పెట్టుబడికి నెలకు పదివేలు ఇస్తామంటూ నమ్మబలికాడు కేటుగాడు.. అలా దాదాపు రూ. 25 కోట్లు వసూలు చేశారు. కర్నూలు, నంద్యాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో 300 మందికి పైగా భాదితులు ఉన్నట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో ఐఎఎస్‌లు బదిలీలు అయ్యారు. వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్‌గా 2009 బ్యాచ్ ఐఎఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ నియమించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ కమిషనర్‌గా పని చేశారు. అలాగే.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా 2013 ఐఎఎస్ అధికారి డాక్టర్ లక్ష్మీ షా నియమించారు.
విజయవాడలో వక్ఫ్ పరిరక్షణ మహా సభలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సంప్రదాయాలకు విరుద్దంగా వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోందని అన్నారు. వైఎస్ జగన్ ఎప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తారని తెలిపారు.
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పర్యటనలో స్టీల్ ప్లాంట్ కోసమే మాట్లాడలేదని అన్నారు. అడిగితే దాటవేసే ప్రయత్నం చేశారు.. సీఎం చంద్రబాబే తాము కట్టిన కట్టడాన్ని మెచ్చుకున్నాడని అన్నారు. కానీ ప్రజలను తప్పు దోవ పట్టించి జగన్ కోసం కట్టుకున్న ప్యాలెస్‌గా చెప్తున్నాడని గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు.
చంద్రబాబు నాయుడుతో ఢీ కొట్టడం అంటే ఎప్పుడు సిద్ధమేనని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. తాను కార్యకర్తల మనిషిని, కార్యకర్తల కోసమే నిలబడతానని అన్నారు. తాను గ్రూపులు కట్టడానికి రాలేదు.. ఒక నేతగా కాదు.. కార్యకర్తలకు అండగా నిలుస్తానన్నారు. నియోజకవర్గంలో ఇంఛార్జికి అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.
వైసీపీకి ఆధారం.. మూలం, బలం కార్యకర్తలు మాత్రమేనని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జగన్ జెండా మోస్తూ.. జై కొట్టినంత సేపు మాత్రమే నాయకులకు, కార్యకర్తలు జై కొడతారన్నారు. జెండా వదిలితే మాత్రం ఆ నాయకుడు కార్యకర్తకు అవసరం లేదని చెప్పారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు రెడ్ బుక్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రెడ్ బుక్కు తమ కుక్క కూడా భయపడదని విమర్శించారు. తమ ఆఫీస్‌ను కూల్చినట్లు.. రుషి కొండను కూల్చేస్తారా అని అన్నారు. చంద్రబాబు రుషి కొండ భవనాలు చూసి ఆశ్చర్య పోతున్నారు.. చంద్రబాబు ఈ భవనాలు చూసి సిగ్గు పడాలని దుయ్యబట్టారు.