TTD: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాలపై భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది.
Polavaram Project: రేపటి నుంచి పోలవరంలో కేంద్ర నిపుణుల బృందం పర్యటించనుంది. గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాల్లో నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ పనుల నాణ్యత ఈ టీమ్ పరిశీలించనుంది. అల్లూరి జిల్లా దండంగి గ్రామం వద్ద స్పిల్వే సమీపంలో ఉంచిన మట్టి నిల్వల నుంచి శాంపిల్స్ సైతం సేకరించనున్నారు.
Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు అని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ భూముల్లోనే అసెంబ్లీ, హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణం కోసం డిజైన్ కూడా రెడీ చేయడం జరిగిందన్నారు.
Physical Harassment: తిరుపతిలోని శిల్పారామంలో లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. శిల్పారామం మ్యూజియం దగ్గర సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న మహిళపై లైంగిక దాడి చేసేందుకు యత్నించారు.
Marine Fishing Ban: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో సముద్ర జలాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. జూన్ 14వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ నిషేధాంక్షలు అమల్లో ఉంటాయని మత్స్యశాఖ ప్రకటించింది.
AP Cabinet: ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. అమరావతి రాజధాని నిర్మాణంలో ఫేజ్- 2 భూ సేకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
Minister Satya Kumar: ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆర్ధిక రంగంలో దేశంలోనే మొట్ట దటి పీహెచ్డీ సాధించిన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. అలాంటి ఆయనను న్యాయశాఖకు మాత్రమే పరిమితం చేసి ఆర్థిక, రక్షణ రంగాలకు అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దూరం చేశారని ఆరోపించారు.
రాజధానిని స్మశానం అన్నారు.. ఈ రోజు స్వేచ్చా వాతావరణంలో మాట్లాడుకుంటున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2019 నుంచి 2024 వరకూ భయంకరమైన వాతావరణం ఉంది.. నా జీవితంలో అలాంటిది ఎప్పుడూ చూడలేదు.. నేనుకూడా బయటకు రాలేని పరిస్థితి ఉండేదన్నారు.. హెలికాప్టర్ లో వస్తే కింద ఉన్న చెట్లను నరికేశారు.