Crime: విశాఖపట్నంలో సంచలనం రేపిన వివాహిత హత్య కేసును భీమిలి పోలీసులు ఛేదించారు. మహిళతో సన్నిహితంగా ఉన్నవాడే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో అనుమానితుడు క్రాంతి కుమార్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు.
Ambati Rambabu: అమరావతి పునః ప్రారంభ సభలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అసత్యాలు చెప్పారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. అమరావతి ఒక అంతులేని కథ.. అమరావతి నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారు అని మండిపడ్డారు.
Huge Rush In Tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు తిరుమల కొండకు. వీకెండ్ కావడంతో శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు తరలి రావడంతో ఐదు కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Group 1 Mains 2025: ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 89 పోస్టులకు జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. ఉదయం 8:30 నుంచి 9:30 వరకూ పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుంది.
వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే. ఆరు సార్లు పోటీ చేసి మూడు విడతలు గెలిచారాయన. కానీ... ఈసారి తాను గెలిచి, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆయన వైఖరి కాస్త మారినట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాల్లో ఎక్కడా పార్టీ నాయకులు ఇన్వాల్వ్ కావద్దని చెబుతున్నారట ఎమ్మెల్యే.
పార్టీ రీఛార్జ్ ప్రోగ్రామ్లో భాగంగా తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్లో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. కింది స్థాయి నుంచి కీలకమైన పొలిటికల్ అడ్వైజరీ కమిటీలు, జిల్లా అధ్యక్షులతో మీటింగ్లు నడుస్తున్నాయి. అలాగే పెండింగ్లో ఉన్న పార్టీ పదవుల్ని సైతం భర్తీ చేస్తున్నారు. ఇలా... అధికారంలో ఉన్నప్పటికంటే కూడా ఎక్కువగా పార్టీ యాక్టివిటీ నడుస్తుండటంతో.. ఏదో.. ఉంది, ఏం జరుగుతోందన్న అమమానాలు మొదలయ్యాయట రాజకీయ వర్గాల్లో.