Catherine Tresa: మరోసారి ఐటమ్ భామగా ఎమ్మెల్యే మేడమ్.. ఇప్పుడైనా కలిసొచ్చేనా?
- మరోసారి ఐటమ్ భామగా కేథరిన్ థెరిస్సా
- సందీప్ కిషన్ మూవీలో స్పెషల్ సాంగ్
- కేథరిన్‌తో పెప్ నెంబర్ చేయించనున్న విజయ్ తనయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందం ఉంటే సరిపోదు.. కాస్తంత అదృష్టం కూడా తోడవ్వాలి. ఇది హీరోయిన్ ‘కేథరిన్ థెరిస్సా’కు సరిగ్గా సరిపోతుంది. మెస్మరైజ్ చేసే అందం, మంచి అభినయం ఉన్నప్పటికీ.. ఎందుకో కేథరిన్‌కు రావాల్సినంత క్రేజ్ రాలేదనే చెప్పొచ్చు. స్టార్ హీరోలతో నటించినా.. ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్‌కు పరిమితం కావడం వల్ల స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగలేకపోయారు. కెరీర్ స్టార్ట్ చేసి 15 ఏళ్లు అవుతున్నా.. ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, బింబిసార తప్ప చెప్పుకోదగ్గ హిట్స్ లేవు అమ్మడి ఖాతాలో. ‘వాల్తేరు వీరయ్య’లో కనిపించినా రెండు మూడు సీన్లకే పరిమితమయ్యారు.
థరిన్ థెరిస్సా ప్రస్తుతం అరకొర సినిమాలతో కెరీర్ నెట్టుకొస్తున్నారు. ఈ ఏడాది తమిళ సినిమా గ్యాంగర్స్ మూవీతో సరిపెట్టారు. తెలుగులో మన శంకర్ వరప్రసాద్ గారులో కనిపించబోతున్నారు. అయితే ఇందులో నయనతారది లీడ్ రోల్ కావడంతో.. ఇక ఎంత మంది ఉన్నా సపోర్టింగ్ రోల్స్‌తో సరిపెట్టుకోవాల్సిందే. ప్రస్తుతం తెలుగులో ‘ఫణి’ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా గురించి అప్‌డేట్స్ లేవు. అయితే తాజాగా క్యాథరిన్ ఓ ఐటమ్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. జాసన్ సంజయ్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్న ‘సిగ్మా’లో పెప్ సాంగ్ చేయబోతున్నారట. ఈ మూవీలో సందీప్ కిషన్‌తో కలిసి స్టెప్పులు వేయనున్నారని టాక్.
Also Read
Also Read: Realme P4x 5G Offers: కూపన్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్.. రూ.13,499కే సరికొత్త రియల్‌మీ పీ4ఎక్స్ ఫోన్!
ఐటమ్ సాంగ్‌లో నర్తించడం కేథరిన్‌కు కొత్తేమీ కాదు.. గతంలో ;జయ జానకి నాయక;లో స్పెషల్ సాంగ్‌లో కనిపించారు. ఈ ఏడాది తనే హీరోయిన్‌గా నటించిన ‘గ్యాంగర్స్’లో ఓ పాటకు ఊరమాస్ స్టెప్పులేసి అల్లాడించారు. స్పెషల్ సాంగ్స్‌తో మిగిలిన హీరోయిన్స్ ఆఫర్లు కొల్లగొడుతుండటంతో.. ఇప్పుడే జ్ఞానోదయమైనట్లుంది ఎమ్మెల్యే మేడమ్‌కు. అందుకే సిగ్మాలో పెప్ సాంగ్‌కు ఒకే చెప్పారట. మరి ఈ స్పెషల్ సాంగ్ అయినా ఈ బొద్దు గుమ్మకు ఆఫర్స్‌ని తెచ్చిపెడతాయో చూడాలి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!