సీపీఎం పార్టీ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే కుంజా బుజ్జి అనారోగ్య కారణాలతో అస్తమించారు.. అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతోన్న ఆయన గత నెల తీవ్ర అస్వస్థతకు గురికాగా.. భద్రాచలం పరిధిలో గల ప్రభా శంకర్ ఆస్పతిలో చేర్పించారు.. ఆయన వయస్సు 95 ఏళ్లు.. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎన్నికయ్యారు.. నేటి తరానికి ఆదర్శ నేతగా.. నిజాయితీకి ప్రతిరూపంగా బతికిన ఆయనకు ఇప్పటికీ సొంత ఇల్లు కూడా లేదు.. ప్రజలే నా ఆస్తి.. ప్రజాసేవ చేస్తే చాలు అని నమ్మిన వ్యక్తి.. పుచ్చలపల్లి సుందరయ్య అడుగుజాడల్లో నడిచి ఆయన సిద్ధాంతాలు పాటించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు కుంబా బుజ్జి..
అయితే.. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతోన్న ఆయన.. ఒంట్లో నీరు చేరడం, ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో.. ఆస్పత్రిలో చేర్చారు.. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇక, గత ఏడాది కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య.. కుంజా బుజ్జి తర్వాత సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే.