మాములు రోజుల్లో ఆదివారం వచ్చింది అంటే నాన్ వెజ్ మార్కెట్లు జనాలతో కిటకిటలాడుతుంటాయి. అయితే, ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుంటున్న నేపథ్యంలో ఆంక్షలను అమలు చేస్తున్నారు. తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇంకా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నా, మరణాల రేటు పెరుగుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా విజయవాడ, కడప జిల్లాల్లో పరిస్థితులు దారుణంగాఉన్నాయి . మాస్క్ పెట్టుకోవడం లేదని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా, వెటకారంగా సమాధానాలు చెప్తున్నారు. మరోసారి లాక్ డౌన్ విధించడమే మంచిదని బెజవాడ వాసులు చెప్తుండగా, ప్రభుత్వమే వదిలేసిందని మేం ఎంత అని అంటున్నారు నగరవాసులు. కరోనా కట్టడికి ప్రజల సహకారం తప్పనిసరి అని, ప్రజలు సహకరించకుంటే పెనుప్రమాదం తప్పదని అధికార యంత్రాంగం చెప్తున్నది. వారాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు విధించకుంటే కరోనా మహమ్మారి మరింత ఉగ్రరూపం దాల్చడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.