ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజుకు వెయ్యికి పైగా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 21,954 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,28,186 కు చేరింది. ఇందులో 10,37,411 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,82,329 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో…
చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన అమర రాజా కంపెనీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అమర రాజా పరిశ్రమను మూసివేయాలని ఇటీవలే పీసీబీ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా పరిశ్రమకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. దీంతో కంపెనీ యాజమాన్యం హైకోర్టులో కేసులు ఫైల్ చేసింది. ఈ కేసును విచారించిన హైకోర్టు పీసీబీ ఆదేశాలను సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించింది. విద్యుత్ ను పునరుద్ధరణ చేయాలనీ ఆదేశించింది. జూన్ 17 వ తేదీలోగా ఆదేశాలను అమలు చేయాలనీ పీసీబీకి సూచించింది హైకోర్టు. …
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే ఈరోజు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,16,367 శాంపిల్స్ పరీక్షించగా 22,204 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్‌తో 85 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 11,128 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఏపీలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. తాజాగా మరికొన్ని ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఆంక్షలను కఠినంగా అమలు చేయబోతున్నారు. ఎయిర్ పోర్ట్ ఆవరణలోకి ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికుడితో పాటుగా డ్రైవర్ కు మాత్రమే ఎయిర్ పోర్ట్ ఆవరణలోకి అనుమతి ఉంటుంది. వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ప్రాధాన ద్వారం వద్దే నిలిపివేయనున్నారు. …
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. ఈనెల 15 వ తేదీన సబ్బం హరి కరోనా బారిన పడ్డారు. మూడోరోజులపాటు సబ్బం హరి హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తరువాత వైద్యుల సలహామేరకు ఆయన విశాఖ అపోలో ఆసుపత్రిలో చేరారు. కరోనాతో పాటుగా ఆయనకు పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో పరిస్థితి విషమించింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. జూన్ 1, 1952 లో జన్మించిన సబ్బం హరి 1995 లో విశాఖపట్నానికి మేయర్…
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు సూచనల మేరకు పరీక్షలు వాయిదా వేసింది ప్రభుత్వం. దీని పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందిస్తూ… పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుంది అని చెప్పిన ఆయన ఇదే విషయాన్ని రేపు హై కోర్టుకు కూడా తెలియజేస్తాం అన్నారు. అయితే ఒంతకముందు మే 5 నుంచి పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ ఆ మేరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు కూడా…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. రోజుకో కొత్త రికార్డు తరహాలో కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉండగా.. సెకవండ్ వేవ్‌లో అత్యధికంగా ఇవాళ ఏకంగా 19 వేల పైచీలుకు కేసులు నమోదు అయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన తాజా బులెటిన్ ప్రకారం.. గతో 24 గంటల్లో 19,412 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 61 మంది కోవిడ్ బారినపడి మృతిచెందారు.. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,21,102కు చేరుకోగా.. మృతుల…
కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై కాకినాడ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు మంత్రి ఆళ్ల నాని.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పనిచేస్తున్న కోవిడ్ ఆస్పత్రులు 420, ఐసియు బెడ్స్ 5,601, ఆక్సిజన్ బెడ్స్ 18,992గా ఉన్నాయని.. రాష్ట్రవ్యాప్తంగా 3120 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. కరోనా సెకండ్ వేవ్ ని సాధ్యమైనంత మేరకు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందన్న మంత్రి.. 104 కాల్ సెంటర్ అత్యంత కీలకమైన వ్యవస్థగా సీఎం…
రైతుల తరపున రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటానికి నేను సిద్ధం అన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ఇవాళ మరోసారి సీఐడీ విచారణకు హాజరైన ఆయన.. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో జే టాక్స్ పేరుతో ధాన్యం దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.. సమయం అంతా దేవినేని ఉమను, ధూళిపాళ్ల నరేంద్రని ఇబ్బంది పెట్టడానిఇ వెచ్చిస్తున్నారన్న ఆయన.. దేవినేని ఉమను 9 గంటలు సీఐడీ కార్యాలయంలో కూర్చోబెడితే ఏమి వస్తుంది? అంటూ మండిపడ్డారు..…
మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడినవారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది.. అయితే, చాలా రాష్ట్రాలను వ్యాక్సిన్ కొరత వేధిస్తుండడంతో.. ఇప్పుడే మా వళ్ల కాదంటూ చాలా రాష్ట్రాలు చేతులెత్తేశాయి.. ఇప్పటికే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభం కాగా, పెద్ద సంఖ్యలో యూత్ రిజిస్ట్రేషన్ చేసుకునే పనిలో పడిపోయారు.. వారి తాకిడికి సర్వర్లే మోరాయించాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక, ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఇప్పట్లో సాధ్యం…