ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు సూచనల మేరకు పరీక్షలు వాయిదా వేసింది ప్రభుత్వం. దీని పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందిస్తూ… పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుంది అని చెప్పిన ఆయన ఇదే విషయాన్ని రేపు హై కోర్టుకు కూడా తెలియజేస్తాం అన్నారు. అయితే ఒంతకముందు మే 5 నుంచి పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ ఆ మేరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు కూడా చేసుకుంది. కానీ ఈ కరోనా కాలంలో పరీక్షలు నిర్వహించడం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెన్నకి తగ్గింది ప్రభుత్వం.