సినీ లవర్స్‌కి, ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని కోరుకునే ఆడియన్స్‌కి గుడ్ న్యూస్. అల్లు సినిమాస్ వాళ్లు హైదరాబాద్‌లో ఇండియాలోనే అతి పెద్ద డాల్బీ సినిమా (DOLBY CINEMA) స్క్రీన్‌ను ఓపెన్ చేయబోతున్నారు. ఆడియన్స్ కి కిక్ ఇచ్చేలా, సరికొత్త అనుభూతిని అందించే ఉద్దేశంతో ఈ భారీ తెరను తీసుకొస్తున్నారు. మరి ఈ గ్రాండ్ ఓపెనింగ్‌కి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సినిమా ఏదో తెలుసా? ప్రపంచమంతా వెయిట్ చేస్తున్న ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’. ఆ సినిమాతోనే ఈ కొత్త డాల్బీ స్క్రీన్ స్టార్ట్ కాబోతుందట!
Also Read : Avatar & Raja Saab: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ కి.. అవతార్ 3 భారీ షాక్
ఈ స్క్రీన్ మామూలుగా ఉండదు. దీని వెడల్పు ఏకంగా 75 అడుగులు (75 ft-wide) ఉంటుందట. DCI ఫ్లాట్ 1.85:1 ఫార్మాట్‌లో డిజైన్ చేశారు. విజువల్స్ అయితే మెంటల్ మాస్ అంతే. దీనికోసం టాప్ క్లాస్ #DolbyVision తో పాటు, 3D ఎక్స్‌పీరియన్స్ కోసం #Dolby3D టెక్నాలజీ వాడుతున్నారట. సౌండ్ గురించి చెప్పాలంటే, DolbyAtmos సౌండ్ సిస్టమ్ యాడ్ చేశారు. ఇది ఆడియన్స్‌ను సినిమా లోపలికి లాక్కెళ్లినంత ఫీలింగ్ ఇస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాకుండా, హాయిగా సినిమా చూసేందుకు వీలుగా, థియేటర్‌లో ‘పిచ్-బ్లాక్ స్టేడియం సీటింగ్’ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద, సినిమా చూసే అనుభవాన్ని ఇది మరో లెవల్‌కు తీసుకెళ్లడం పక్కా. దీంతో ఈ మల్టీప్లెక్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని జనాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.