Best Hollywood Action Thrillers: థియేటర్లను షేక్ చేసిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు… వీటిలో ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది భయ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Best Hollywood Action Thrillers : సినిమా హాల్లో లైట్లు బంద్ అయ్యాక, బిగ్ స్క్రీన్ మీద సౌండ్ బాక్సులు బద్దలవుతుంటే వచ్చే కిక్కే వేరు. ఇక హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు థియేటర్లలో సృష్టించే హంగామా మామూలుగా ఉండదు. బాడీలో అడ్రినలిన్ రష్ పెంచేసి, సీటు అంచున కూర్చోబెట్టే అలాంటి ఎనిమిది ఎపిక్ హాలీవుడ్ యాక్షన్ సినిమాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. వీటిలో ఒక్కటి చూసినా సరే, ఆ యాక్షన్ సీన్లకి మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. ఈ బ్లాక్బస్టర్లన్నీ ఇప్పుడు ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో ఉన్నాయో కూడా తెలుసుకుందాం.
1. ది ఫ్యుజిటివ్ (The Fugitive – 1993)
భార్యను చంపని నేరానికి జైలుపాలైన ఒక డాక్టర్, పోలీసుల నుంచి తృటిలో తప్పించుకుని అసలు నిందితుడిని ఎలా పట్టుకున్నాడనేదే ఈ కథ. హారిసన్ ఫోర్డ్, టామీ లీ జోన్స్ మధ్య జరిగే మైండ్ గేమ్స్, చేజింగ్ సీన్లు మిమ్మల్ని అస్సలు కుదురుగా కూర్చొనివ్వవు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అద్దెకు అందుబాటులో ఉంది.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
2. టెర్మినేటర్ 2: జడ్జ్మెంట్ డే (Terminator 2: Judgment Day – 1991)
యాక్షన్ సినిమాలకు సరికొత్త డెఫినిషన్ ఇచ్చిన సినిమా ఇది. జేమ్స్ కామెరాన్ అప్పట్లోనే సృష్టించిన విజువల్ వండర్ ఇది. ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్ ‘రోబో’గా వచ్చి చేసే యాక్షన్, లిక్విడ్ మెటల్ విలన్ ఫైట్లు థియేటర్లను షేక్ చేశాయి. ఇప్పటికీ ఇది ఆల్-టైమ్ బెస్ట్ యాక్షన్ మూవీ. లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play), జియో హాట్ స్టార్ (Jiohotstar)లో ఇది అందుబాటులో ఉంది.
3. ప్రిడేటర్ (Predator – 1987)
ఒక దట్టమైన అడవి, కంటికి కనిపించని ఒక వింత గ్రహాంతర జీవి, దాన్ని వేటాడే ఆర్నాల్డ్ ఆర్మీ గ్రూప్. ఈ సినిమా ఇచ్చే థ్రిల్, భయం అంతా ఇంతా కాదు. థియేటర్లలో జనాలు ఈ సినిమా చూసి పిచ్చెక్కిపోయారు. క్లైమాక్స్ వరకు ఈ సినిమా చూపు తిప్పుకోనివ్వదు. జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో ఈ వండర్ ని చూడచ్చు.
4. ది రాక్ (The Rock – 1996)
మైఖేల్ బే డైరెక్షన్లో వచ్చిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో నికోలస్ కేజ్, సీన్ కానరీ నటన అద్భుతం. అల్కాట్రాజ్ జైలును హైజాక్ చేసిన విలన్ల నుంచి నగరాన్ని కాపాడే మిషన్ ఇది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గన్ ఫైట్లు అదిరిపోతాయి ఇందులో. జియో హాట్‌స్టార్ (JioHotstar)లో సినిమాను చూడచ్చు.
5. మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్ (Mad Max: Fury Road – 2015)
ఈ సినిమా ఒక నాన్-స్టాప్ విజువల్ పొయెట్రీ. సినిమా స్టార్ట్ అయిన మొదటి నిమిషం నుండి ఎండ్ కార్డ్ పడే వరకు రోడ్ రేజ్, కారు ఛేజింగ్‌లు, బ్లాస్టింగ్‌లే ఉంటాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువగా వాడకుండా రియల్ స్టంట్స్‌తో థియేటర్లలో దుమ్ములేపారు. చూసిన ప్రతి ప్రేక్షకుడికి పిచ్చెక్కిపోద్ది. మళ్ళీ మళ్ళీ చూస్తూ నోరెళ్ళబెట్టేస్తారు కూడా. జియో హాట్ స్టార్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది. Apple TVలో కూడా ఇది రెంటల్ లో చూడచ్చు.
6. మిషన్ ఇంపాజిబుల్ – ఫాల్అవుట్ (Mission: Impossible – Fallout – 2018)
టామ్ క్రూజ్ అంటేనే డూప్ లేకుండా ప్రాణాలకు తెగించి స్టంట్స్ చేసే హీరో. ఈ సినిమాలో హెలికాప్టర్ ఫైట్, బిల్డింగ్‌ల పైనుంచి దూకడం, పారిస్ వీధుల్లో బైక్ ఛేజ్ సీన్లు చూస్తే గూస్బంప్స్ గ్యారెంటీ. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో (Netflix, Amazon Prime Video)లో ఇది అందుబాటులో ఉంది.
7. టాప్ గన్: మావెరిక్ (Top Gun: Maverick – 2022)
దాదాపు 30 ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ అయినా, థియేటర్లలో సౌండ్ సిస్టమ్‌ను షేక్ చేసింది ఈ యాక్షన్ మూవీ. రియల్ ఫైటర్ జెట్స్‌లో షూట్ చేసిన స్కై యాక్షన్ సీన్లు మిమ్మల్ని థియేటర్ సీట్లో కూర్చోబెట్టి, నిజంగానే ఆకాశంలో విహరింపజేస్తాయి. నెట్‌ఫ్లిక్స్ / ప్రైమ్ వీడియో (Netflix, Amazon Prime Video)ఈ యాక్షన్ మూవీ అందుబాటులో ఉంది.
8. జాన్ విక్: చాప్టర్ 4 (Keanu Reeves – John Wick 4 – 2023)
కీను రీవ్స్ నటించిన ఈ సినిమా యాక్షన్ కొరియోగ్రఫీకి ఒక కేరాఫ్ అడ్రస్. గన్స్, మార్షల్ ఆర్ట్స్ స్టైల్ ఫైట్లు, పారిస్ ట్రాఫిక్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. యాక్షన్ లవర్స్‌కు ఇది ఒక పండగ లాంటి సినిమా. లయన్స్ గేట్ ప్లే, అమెజాన్ ప్రైమ్ (Lionsgate Play, Prime Video)లో ఇది అందుబాటులో ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లను వీకెండ్లో హోమ్ థియేటర్ లో పాప్‌కార్న్ తింటూ ఎంచక్కా చూసేయండి. థియేటర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కూడా పక్కాగా ఉంటుంది.
తాజావార్తలు
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..