జమ్మలమడుగు ‘దేవగుడి’ కుటుంబంలో రాజకీయ క్రీడ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాబాయ్ ఒక పార్టీలో ముఖ్య నేత. అబ్బాయి మరొక పార్టీలో యువనేత. నిన్న మొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న ఆ కుటుంబంలో రాజకీయ క్రీడ మొదలైందా? ఇంతకు ఎవరా అబ్బాయ్.. ఎవరా బాబాయ్? లెట్స్ వాచ్..!
భూపేష్‌రెడ్డే రాజకీయ వారసుడిగా అప్పట్లో ఆదినారాయణరెడ్డి ప్రకటన..!
Also Read
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
దేవగుడి కుటుంబంలో రాజకీయ చిచ్చు రగులుకునేలా కనిపిస్తోంది. ఎన్నిరకాల ఒడిదుడుకులు ఎదురైనా ఒక్కటిగా ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు రెండుగా చీలిపోనుందా? ఏ రాజకీయం అయితే వారిని కలిపిందో.. అదే రాజకీయం ఇప్పుడు విభేదాలు రాజేయబోతోందా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. 2014లో వైసీపీ నుంచి ఆదినారాయణరెడ్డి వరసగా గెలిచి.. టీడీపీ కండువా కప్పుకొని ఏకంగా మంత్రి పదవి చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సందర్భాలలో తన రాజకీయ వారసుడు తన అన్న నారాయణరెడ్డి కుమారుడు భూపేష్‌రెడ్డి అని ఆదినారాయణరెడ్డి బహిరంగంగా చెప్పేవారు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా.. 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు టికెట్ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి దక్కడంతో ఆదినారాయణరెడ్డి కుటుంబానికి టీడీపీ అధిష్ఠానం ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడయ్యారు.
భూపేష్‌రెడ్డి జమ్మలమడుగు టీడీపీ ఇంఛార్జ్..!
బీజేపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి రివర్స్ గేర్..!
భూపేష్‌రెడ్డి దగ్గరకు వెళ్లొద్దని అనుచరులకు మాజీ మంత్రి ఫోన్లు?
బాబాయ్ వెళ్లిపోవడం.. ఎలాగూ తననే వారసుడని గతంలోనే అనేకసార్లు ప్రకటించి ఉండటంతో భూపేష్ రంగంలోకి దిగారు. ఏ నాయకుడులేని టీడీపీని తన రాజకీయ ప్రస్థానానికి మార్గంగా ఎంచుకున్నారు. ఇదే సమయంలో భూపేష్‌రెడ్డిని జమ్మలమడుగు ఇంఛార్జ్‌గా టీడీపీ ప్రకటించింది.ఇక బీజేపీలో ఉన్నా ఎన్నికల నాటికి ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం అని అనుకున్నారో ఏమో భూపేష్‌ను టీడీపీ ఇంఛార్జ్ చేయడం ఆదినారాయణరెడ్డికి రుచించలేదు. అప్పటి వరకు భూపేషే వారసుడని ప్రకటించిన మాజీ మంత్రి రివర్స్ గేర్ వేయడం మొదలుపెట్టారు. మేం ఇద్దరం ఒకే పార్టీలో ఉంటేనే అతను నాకు వారసుడు అంటూ ఫిట్టింగ్ పెడుతున్నారట ఆది. అంటే తాను బీజేపీలో ఉన్నానని.. భుపేష్ టీడీపీలో ఉంటే తన వారసుడు ఎలా అవుతారని అంటున్నారట. అంతేకాదు..తన అనుచరులు.. ముఖ్యనేతలను భుపేష్‌రెడ్డి దగ్గరకు వెళ్లొద్దని, తిరగొద్దని ఆదినారాయణరెడ్డి ఫోన్లు చేసి మరీ చెబుతున్నారట.
నారాయణరెడ్డి కుటుంబం ఇప్పుడు కలిసే నిర్ణయం తీసుకుంటుందా?
దశాబ్దాలుగా నారాయణరెడ్డి సోదరులకు వెన్నుదన్నుగా ఉన్న కేడర్.. అనుచరులు దిక్కుతోచని స్థితిలో పడ్డారట. తాను చెప్పినట్టు వింటే నా రాజకీయ వారసుడుగా భూపేష్ ఉంటాడు. ఇప్పుడు నేనొక పార్టీ, భూపేష్ వేరే పార్టీ ఉన్నాం కాబట్టి అవన్నీ కుదరవు అని ఆదినారాయణ రెడ్డి బహిరంగానే చెబుతున్నట్టు సమాచారం. ఎన్నో సమస్యలు వచ్చిన కలిసి మెలిసి ఎదుర్కొన్న నారాయణరెడ్డి కుటుంబం ఇప్పుడు కూడా కలిసే నిర్ణయం తీసుకుంటుందా.. లేక ఈ మాటల వెనక మాజీ మంత్రి వ్యుహాత్మక ఆలోచనలు ఏమైనా ఉన్నాయా తెలియాలి. ఇన్నాళ్లూ రాజకీయంగా కలసికట్టుగా ఉన్న దేవగుడి సోదరుల మధ్య రానున్న రోజుల్లో పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూడాలి.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?