ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 1న ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ఏపీలో మొత్తం 4.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1.99 కోట్ల మంది, మహిళలు 2.4 కోట్ల మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 4,041 మంది ట్రాన్స్ జెండర్లు, 67,090 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. అయితే ఏపీలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. ఏపీ వ్యాప్తంగా…
ధాన్యం సేకరణ, కొనుగోళ్ల పై మంత్రుల బృందంతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. కీలక సూచనలు చేశారు.. ధాన్యం సేకరణపై పటిష్ట విధానం ఉండాలని ఆదేశించారు.. ఆర్బీకేల స్థాయిలోనే, ఫాంగేట్ వద్దే కొనుగోళ్ళు జరగాలని.. మోసాలు, అవినీతికి తావులేకుండా అత్యంత పారదర్శక విధానం అమలు చేయాలని.. రైతుకు మంచి ధర వచ్చేలా చూసేందుకే ఈ చర్యలు తీసుకోవాలని సూచించారు.. ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం సేకరణ కేంద్రాలు ఉండాలన్న ఏపీ సీఎం.. పేమెంట్స్‌లో మోసాలు లేకుండా…
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది.. మరికొన్ని గంటల్లో ఫలితం కూడా వెలువడనుంది.. ఈ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు దూరంగా ఉండగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థులను పోటీకి పెట్టాయి.. ఇక, బీజేపీ అభ్యర్థిని టీడీపీ, జనసేన సహకరించిందనే విమర్శలు కూడా ఉన్నాయి.. ఏకంగా కొన్ని పోలింగ్ బూతుల్లో బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలను కూర్చున్నారంటూ సోషల్ మీడియాలో ఫొటోలు హల్చల్ చేశాయి. అయితే, ఈ ఎన్నికల్లో తమ రిస్థితి…
నా చర్మంతో సీఎం వైఎస్ జగన్‌కు చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చుకోలేనిది అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. తాజాగా ఆయన శాఖల్లో కోత విధించింది ప్రభుత్వం. వాణిజ్య పన్నుల శాఖను నారాయణ స్వామి నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.. ఇక, వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగించారు.. ఎక్సైజ్ శాఖకే నారాయణస్వామిని పరిమితం చేశారు. ఈ పరిణామంపై కొన్ని విమర్శలు వచ్చాయి..…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది.. ఫిర్యాదుల పర్వానికి ఇప్పట్లో తెర పడేలా కనిపించడం లేదు.. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్ని వివాదాల పరిష్కారానికి ఇటు కృష్ణానది యాజమాన్య బోర్డు, అటు గోదావరి నది యాజమాన్య బోర్డు పరిధిలను నిర్ణయిస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసినా.. ఇంకా పులిస్టాప్ పడే దాఖలాలు కనిపించడంలేదు.. ఇవాళ కేఆర్ఎంబీకి మరో లేఖరాసింది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ.. రాజోలిబండ హెడ్ వర్క్స్ ను కూడా కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిలోకి…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 25,532 శాంపిల్స్ పరీక్షించగా.. 220 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 4 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 429 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 2,95,44,319 కు పెరగగా… మొత్తం…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… సీఎం వైఎస్ జగన్‌కు స్టీల్ ప్లాంట్‌పై చిత్తశుద్ధి ఉంటే… తక్షణమే అఖిపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.. కాసేపటి క్రితం టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. తాజాగా విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై చర్చించారు.. ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడించేలా అన్ని శక్తులను కేంద్రీకరించాలని…
ఎయిడెడ్ విద్యాసంస్థలకు చెందిన లక్షల కోట్ల ఆస్తులను తాకట్టు పెట్టి, అప్పులు తేవాలన్న తాపత్రయంలో ప్రభుత్వముంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కేవలం ఆస్తుల కోసమే ఎయిడెడ్ విద్యావ్యవస్థల స్వాధీనానికి ప్రభుత్వం సిద్ధమైంది. విద్యావ్యవస్థ పతనానికి దారితీసేలా సీఎం వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎయిడెడ్ విద్యావ్యవస్థను పునరుద్ధరిస్తుంది. లక్షలాది విద్యార్థులు, వేలాదిమంది ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకునే హక్కు ఈప్రభుత్వానికి ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల స్వాధీనంతో,…
తమిళనాడు తీరము మరియుశ్రీలంక తీరానికి పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కొమరిన్ మరియు ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల మీద ఉన్నది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 km ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతున్నది. ఇది రాగల 48 గంటలలో ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతం మీదకు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. తదుపరి 48 గంటలలో ఉత్తర వాయవ్యం గా…
ఏపీలో ఎన్నికలు జరగని స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. 14వ తేదీన పంచాయతీలకు, 15న మున్సిపాల్టీలు, కార్పోరేషన్లకు, 16న ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికల నిర్వహాణ ఉంటుంది. 14వ తేదీనే పంచాయతీలకు కౌంటింగ్ జరుగుతుంది. ఇక 17వ తేదీన మున్సిపాల్టీలు, కార్పోరేషన్లకు కౌంటింగ్… 18వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కౌంటింగ్ ఉంటుంది. అయితే ఏపీ వ్యాప్తంగా మొత్తంగా 498 గ్రామ పంచాయతీల పరిధిలోని 69…