ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 18,788 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 122 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 20,73,852కి చేరింది. నిన్న కరోనా వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 14,453కి చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 213 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 20,57,369 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా రాష్ట్రంలో 2,030 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జిల్లాల వారీగా కరోనా కేసులు: శ్రీకాకుళం-5, విజయనగరం-1, విశాఖ-15, తూ.గో.-31, ప.గో.-2, కృష్ణా-15, గుంటూరు-18, ప్రకాశం-0, నెల్లూరు-3, చిత్తూరు-18, అనంతపురం-4, వైఎస్ఆర్ కడప-9, కర్నూలు-1
