ఏపీలో సినిమా టికెట్ల రేట్ల వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా అయితే కనిపించడంలేదు. టిక్కెట్ల రేట్ల కారణంగా ఇప్పటికే వందల సంఖ్యలో థియేటర్లు మూతపడ్డాయి. సౌతిండియాలో అతిపెద్ద స్క్రీన్ కూడా మూతపడింది. ఈ ఇష్యూపై ఇటీవల హీరో నాని సంచలన కామెంట్స్ చేయగా తాజాగా హీరో నిఖిల్ స్పందించాడు. ఏపీలో థియేటర్లు మూతపడటం చాలా బాధాకరమన్నాడు. ఏపీలో చాలా చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టిక్కెట్ రేటు రూ.20గా ఉందని.. రైలులో కంపార్టుమెంట్ల ఆధారంలో ప్రీమియం లేదా…
కృష్ణా జిల్లా గుడివాడలో ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, టీడీపీ నేత వంగవీటి రాధాలు ఒకేచోట కలుసుకున్నారు. గుడివాడలోని కొండాలమ్మ గుడి వీరి కలయికకు కారణమైంది. ఈ ముగ్గురూ కృష్ణా జిల్లాలో పేరున్న పొలిటికల్ లీడర్స్ కావడం విశేషం. అంతకుముందు గుడివాడలో వంగవీటి రంగా విగ్రహ ప్రారంభోత్సవానికి వంగవీటి రాధా వెళ్లారు. అనంతరం వల్లభనేని వంశీ, వంగవీటి రాధా కొండాలమ్మ గుడికి వెళ్లగా… రాధాతో పాటు…
కానూరు సిద్ధార్ధ ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఘనస్వాగతం పలికారు విద్యార్ధులు. లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభలో భారత న్యాయవ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు అంశంపై సీజేఐ మాట్లాడారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ప్రభుత్వం కంట్రోల్లో ఉంటారు. దీంతో పీపీలు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు అన్నారు. పీపీల నియామకంలో ప్రత్యేకంగా స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 4.60 లక్షలు కేసులు పెండింగులో ఉన్నాయి. ఒక మిలియనుకు 21…
టిఫినీలు తిన్నారు.. కాఫీలు తాగారు. కీలక సమావేశంలో ల్యాప్‌టాపుల్లో మునిగిపోయారు. ఒకరు 14 అంటే.. ఇంకొకరు 34కి తగ్గేది లేదన్నారు. ఆ మీటింగ్స్‌లో ఇదే జరుగుతోందా? కాలక్షేపం కబుర్లు.. వ్యూహాత్మక ఎత్తుగడలతో సమావేశాలను మమ అనిపించేస్తున్నారా? పీఆర్సీపై ఎడతెగని చర్చలు..! ఏపీలో లక్షలాది మంది ఉద్యోగులకు కీలకమైన పీఆర్సీ కసరత్తు కొలిక్కి రాలేదు. ఫిట్‌మెంట్‌పై తేలుస్తారా తేల్చరా అని ఉద్యోగ సంఘాలు గట్టిగా అడగడంతో… ఆ మధ్య జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు అధికారులు. 13…
ఒకప్పుడు యాజమాన్యాన్ని శాసించారు ఆ ఉద్యోగులు. ఇప్పుడు భయం.. బలహీనం. ఏం జరిగినా నోరెత్తలేని ధైన్యం. ప్రశ్నించే వాళ్లే కరువయ్యారు. ఇంతకీ ఎవరా ఉద్యోగులు? ఏమా కథ? బలంతగ్గి టీటీడీలో వాయిస్ లేని ఉద్యోగులు..! కలియుగ వైకుంఠనాథుడి సన్నిధిలో ఉద్యోగమంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. స్వామి వారిని క్షణకాలం దర్శించుకునే భాగ్యం లభిస్తేనే చాలు.. తమ జీవితం ధన్యమని అనుకుంటారు భక్తులు. అటువంటిది స్వామి సన్నిధిలో నిరంతరం భక్తులకు సేవ చేసుకుంటూ.. ఆ సన్నిధిలోనే ఉద్యోగమంటే ఎంతో…
విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ నటుడి అవతారం ఎత్తారు. ఏపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ప్రశంసలు అందుకున్న ఈ పథకంపై ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఉపాధ్యాయుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ‘అమ్మ ఒడి’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి త్రినాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. Read Also: ఒమిక్రాన్‌కు మందు…
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. ఎల్లుండి ఆన్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. జనవరి మాసానికి సంబంధించి రోజుకు 10వేల చొప్పున టోకెన్లను ఈనెల 27న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే వైకుంఠ ఏకాదశి వేడుకలు ఉన్న సందర్భంగా జనవరి 13 నుంచి 22 వరకు రోజుకు 5 వేల టోకెన్లను మాత్రమే అందుబాటులో ఉంచుతామని టీటీడీ పేర్కొంది. Read Also: నాసా ప్రయోగం సక్సెస్……
పార్టీకి ఛార్జింగ్ ఎక్కించేందుకు అక్కడ టీడీపీ ప్రయోగాలు చేస్తోందా? ఈక్వేషన్లు తేడా కొడుతున్నాయా? బలమైన నాయకత్వం ఉన్నా.. క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనంగా ఉందా? తాజా ప్రయోగమైనా ఫలితాన్నిస్తుందా? ఏంటా నియోజకవర్గం? ఇంఛార్జ్ మార్పు టీడీపీకి కలిసి వస్తుందా? కర్నూలు జిల్లా నందికొట్కూరు. ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు బలంగా ఉన్న టీడీపీ ఇపుడు జీరో అనే చెప్పాలి. ఈ పరిస్థితికి టీడీపీ అధిష్ఠానం బాధ్యతారహిత్యం కూడా కారణమని చెబుతారు. పచ్చ జెండాపై ప్రేమ, టీడీపీపై అభిమానం ఉన్న కేడర్‌లో…
ఏపీ లో కరోనా కేసులు ఓ రోజు పెరుగుతూ ఓ తగ్గుతూ వస్తున్నాయి. అయితే.. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఏపీలో కొత్తగా 104 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈరోజు కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఇక, ఇదే సమయంలో 133 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,11,56,578 కు చేరుకోగా… మొత్తం…