తనను హత్య చేసేందుకు రెక్కీ జరుగుతోందని ఆదివారం నాడు వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించాయి. దీంతో ఆయన హత్యకు ఎవరు రెక్కీ నిర్వహిస్తున్నారనే విషయంపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై వంగవీటి రాధా సోదరుడు వంగవీటి నరేంద్ర స్పందించారు. తన తమ్ముడు టీడీపీలోకి వెళ్లడం తనకు ఇష్టం లేదని.. ఎందుకంటే వంగవీటి రంగా హత్యకు కారణం టీడీపీ నేతలే అని తన అభిప్రాయమన్నారు. అయితే తన తమ్ముడితో…
ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో ఫీజులను ఖరారు చేస్తూ ఏపీలోని జగన్ ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోలను సోమవారం నాడు ఏపీ హైకోర్టు కొట్టివేసింది. వివరాల్లోకి వెళ్తే… ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను తమ ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తగుచర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో ఫీజులను నిర్ణయిస్తూ జీవో నంబర్ 53, జీవో నంబర్ 54ను ప్రభుత్వం జారీ చేసింది. Read Also: ఏపీ సర్కార్‌తో చర్చల దిశగా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చల దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు టాలీవుడ్ పెద్దలు.. మంత్రి పేర్నినానిని కలిసి చర్చలు జరపాలని భావిస్తున్నారు. రేపు సినీ ప్రముఖుల బృందం.. మంత్రి పేర్నినానితో సమావేశం అయ్యే అవకాశం ఉంది.. కాగా, గత కొన్ని రోజులుగా ఏపీలో సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్ని థియేటర్లను ఇప్పటికే మూసివేశారు. టికెట్ రేట్లు తక్కువగా ఉంటే.. సినిమా థియేటర్లను నడపలేమంటూ.. మరికొందరు స్వచ్ఛందంగా సినిమా థియేటర్లను మూసివేస్తున్నారు. దాంతో..…
గత కొంతకాలంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు జనానికి ఇబ్బందులు కలిగించాయి. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన చలి కాస్త తగ్గుముఖం పట్టింది. రెండు వైపుల నుంచి గాలులు వీస్తున్నా, వాటి ప్రభావం కాస్త తగ్గడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి గాలులు తక్కువ ఎత్తులో వీచడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ గాడిన పడుతున్నాయని, చలి తీవ్రత తగ్గిందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర,…
ఏపీ పర్యటనలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిలను జడ్జిలే నియమిస్తారని భావించడం ఓ భ్రమ అని సీజేఐ వ్యాఖ్యానించారు. మిగతా వ్యవస్థల తరహాలో న్యాయవ్యవస్థ కూడా ఓ పావు లాంటిదేనన్నారు. జడ్జిల నియామకాల్లో చాలా మంది పాత్ర ఉంటుందని.. జడ్జిల నియామకాల్లో కేంద్ర న్యాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, హైకోర్టు కొలీజియం, ఇంటెలిజెన్స్ బ్యూరో, అత్యున్నత స్థాయి అధికారుల పాత్ర కూడా ఉంటుందని సీజేఐ తేల్చి చెప్పారు. జడ్జిల…
ఏపీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తేనీటి విందు ఇచ్చారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ దంపతులు, సీఎం జగన్ దంపతులకు రాజ్ భవన్ వర్గాలు సాదర స్వాగతం పలికాయి. కాగా శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎన్వీ రమణకు…
అమరావతి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా ఏపీ ప్రభుత్వంలో చలనం లేదని నిప్పులు చెరిగారు అచ్చెన్నాయుడు. ప్రజల ప్రాణాలకంటే కక్ష సాధింపు చర్యలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషనులో ఏపీ వెనకబడి ఉందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు కరోనా కట్టడి లో ముందుంటే వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో ముందుందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు శూన్యమని మండి…
ఏపీలో కరోనా కేసులు ఓ రోజు పెరుగుతూ.. ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. అయితే.. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఏపీలో కొత్తగా 82 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈరోజు కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఇక, ఇదే సమయంలో 164 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,11,81,664 కు చేరుకోగా… మొత్తం…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సన్మాన సభలో… సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ చలోక్తులు విసిరారు. సెల్ఫీలు, బొకేలు, శాలువా కప్పి ఫోటోలు తీసుకోవడం పై తాపత్రయం వద్దని ఎన్వీ రమణ పేర్కొన్నారు. నేను ఇక్కడి వాడిని… నేను సినిమా హీరోను కాదంటూ ఎన్.వి.రమణ తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారే రిటైర్మెంట్ తర్వాత చూస్తామని పేర్కొన్నారు. రెండు రోజుల నుంచి వరుస కార్యక్రమాలు జరుగుతున్నాయి… తెలంగాణ హైకోర్టు సీజే వెళ్లిపోయారని తెలిపారు. మిగితా వారు కూడా వెళ్లి…
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త అందింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో భారీ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. తాజాగా మరో జాబ్ మేళా ప్రకటనను APSSDC విడుదల చేసింది. కృష్ణా జిల్లా నందిగామలో ఈనెల 27న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ జాబ్ మేళాలో వరుణ్ మోటార్స్, మీషూ, కెస్ కార్పొరేషన్ లిమిటెడ్, డీమార్ట్ వంటి సంస్థలు నియామకాలు చేపట్టనున్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 27న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు…