పోలీస్ శాఖలో ఏపీ ప్రభుత్వం కీలక బదిలీలను చేపట్టింది. ఇప్పటికే ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్‌ను తప్పించిన ప్రభుత్వం… తాజాగా కడప జైలు ఇంఛార్జి సూపరింటెండెంట్ వరుణారెడ్డిని కూడా బదిలీ చేసింది. వరుణారెడ్డి ఒంగోలు జైలర్‌గా బదిలీ అయ్యారు. ఒంగోలు జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న ప్రకాష్‌ను కడప జైలర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవల వరుణారెడ్డి అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. గతంలో పరిటాల హత్య కేసు నిందితుడు మొద్దు…
మార్చిలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులను ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. అయితే జగనన్న విద్యాదీవెన వెరిఫికేషన్ పూర్తికాలేదని ఫోన్‌కు సందేశాలు వచ్చిన విద్యార్థులు వెంటనే గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్లి.. ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను సమర్పించాలి. వెరిఫికేషన్ పూర్తై ఇన్ఎలిజిబుల్ అయితే.. సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్లను కలవాలి. అర్హత ఉన్న విద్యార్థులు అబ్జెక్షన్ రైజ్ చేయడానికి ఈ నెల 21 వరకు గడువు ఉంది. మార్చిలో జగనన్న…
తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇప్పటికే ప్రతీ మంగళవారం.. ఒక ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాల ఇంటి దగ్గర దీక్షలు చేస్తూ వచ్చిన ఆమె.. ఇవాళ టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళనకు దిగారు.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. టీఎస్పీఎస్సీ ఆఫీసు దగ్గర ధర్నా చేపట్టారు.. Read Also: Ashwani Kumar Quits Congress: కాంగ్రెస్‌కు మరో…
ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులను బదిలీ చేస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. సీఎం పేషీలో అత్యంత కీలక పాత్ర పోషించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌ను నిన్ననే బదిలీ చేసిన ప్రభుత్వం.. ఇవాళ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై వేటు వేసేందుకు సిద్ధమైపోయింది.. కొన్ని కేసుల విషయంలో విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. సవాంగ్‌ను కొనసాగిస్తూ వచ్చిన సర్కార్.. ఇప్పుడు అనూహ్యంగా బదిలీ చేసింది.. ఇక, కొత్త డీజీపీ…
మేషం :- ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి చేకూరుతుంది. శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వృషభం :- దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. సోదరీ, సోదరులతో పరస్పర అవగాహన లోపం తలెత్తవచ్చు. కనిపించకుండా పోయిన విలువైన పత్రాలు,…
సినిమా టికెట్ల ధరలు, షోలు, ఇతర సినీ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఇటీవలే తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే.. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, ఆర్. నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణ మురళి సమావేశమై.. సీఎంతో చర్చించడం.. ఆ తర్వాత ప్రశంసలు కురిపించడం జరిగిపోయాయి.. అయితే, దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత…
రహదారులు, భవనాల శాఖతో పాటు విశాఖ బీచ్ కారిడార్ పనుల పురోగతి పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. రహదారుల భద్రత కోసం ఒక లీడ్ ఏజెన్సీను ఏర్పాటు చేయటానికి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. దీనిలో పోలీసు, ట్రాన్స్పోర్ట్, హెల్త్, రోడ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి నిపుణులు ఉంటారు. రోడ్ సేఫ్టీ ఫండ్ ఏర్పాటుకూ సీఎం జగన్ ఆమోద ముద్ర వేశారు. మరోవైపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వం సంయుక్తంగా ఒక డ్రైవింగ్ స్కూలు…
మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆళ్లగడ్డలో జరుగుతోన్న అవినీతిని నిరూపించలేకపోతే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని ప్రకటించారు.. ఆళ్లగడ్డలో రోడ్ల విస్తరణ పేరుతో వైసీపీ నేతలు ప్రజలను లూటీ చేస్తున్నారు.. ప్రజలకు పరిహారం చెల్లించకుండా కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రోడ్ల విస్తరణ పేరుతో వసూళ్లపై కలెక్టర్ దగ్గర విచారణకు రావాలని డిమాండ్ చేసిన ఆమె.. అవినీతిని నిరూపించలేకపోతే రాజకీయలకు గుడ్ బై చెప్పేస్తానని సవాల్ విసిరారు..…
రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… రేపు రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 2021 నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్ట పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సర్కార్.. రేపు రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్… రేపు ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదు జమ చేయబోతున్నారు.. రాష్ట్రంలోని…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతోన్న సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం… కోవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ నిబంధన తొలగిస్తున్నట్టు వెల్లడించారు.. కరోనా కేసులు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నామన్నారు.. అయితే, మాస్క్ ఆంక్షలు కొనసాగాలని నిర్ణయం తీసుకుంది సర్కార్.. ఇక, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇదే సమయంలో ఫీవర్ సర్వే…