ఏపీలో టిక్కెట్ల ధరలపై నెలకొన్న సమస్య కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఇటీవల టాలీవుడ్ పెద్దలు సీఎం జగన్‌ను కలిసి సమస్యలపై వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం గురువారం నాడు జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో రేపు 11:30 గంటలకు జరిగే భేటీ అనంతరం.. ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే టికెట్ ధరల ప్రతిపాదనలు సిద్ధం కాగా.. రేపు ప్రకటన వచ్చే…
మేషం :- ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి అధికారుల మెప్పు పొందుతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఏ విషయంలోనూ ఏకపక్ష నిర్ణయం మంచిదికాదు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వృషభం :- వృత్తుల వారి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. విద్యార్థుల మితిమీరిన ఉత్సాహం వల్ల సమస్యలు తప్పవు. కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యుత్ రంగాల్లో వారికి ఆందోళన తప్పదు.…
అమరావతి: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను నందమూరి కుటుంబసభ్యులు కలిశారు. అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు నందమూరి తారకరామారావు పేరు పెడతానని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నందుకు నందమూరి కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో మంత్రి కొడాలి నానితో పాటు పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, నందమూరి పెద వెంకటేశ్వరరావు, నందమూరి జయసూర్య, చిగురుపాటి మురళి, పలువురు స్ధానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వారు జ్ఞాపికను…
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి హస్తం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య సీఎం జగన్‌ను ఎంతో కుంగదీసిందని ఆయన పేర్కొన్నారు. వివేకా హత్యపై కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. సీబీఐ ఛార్జ్‌షీట్ పేరుతో కేసుతో సంబంధం లేని వారిపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ…
ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్‌ను బదిలీ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈరోజు మధ్యాహ్నం వరకు విధుల్లో ఉన్న గౌతమ్ సవాంగ్‌ను ప్రభుత్వం ఆకస్మికంగా బాధ్యతల నుంచి తప్పించడం తనకు విస్మయం కలిగించిందన్నారు. అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావొచ్చు… కానీ వైసీపీ ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరమేంటని పవన్ ప్రశ్నించారు. గౌతమ్ సవాంగ్ బదిలీపై గల కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.…
ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. దొంగే దొంగ అంటే ప్రజలు నమ్ముతారనే భ్రమలో చంద్రబాబు ఉంటాడని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదానే కావాలని ఉద్యమం చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. జీవీఎల్ నరసింహారావు పక్క రాష్ట్రంలో ఎంపీ పదవి తెచ్చుకున్న వ్యక్తి అని.. పదిహేను రోజులకు…
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పిలుపు మేరకే తాను ఈరోజు ఆయనతో సమావేశం అయ్యానని తెలిపారు. పదవుల కోసం రాలేదని స్పష్టం చేశారు. అయితే త్వరలో పార్టీ ఆఫీసు నుంచి తనకు సంబంధించి ప్రకటన ఉంటుందని అలీ తెలిపారు. రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతో తనకు పాత పరిచయం ఉందని.. వైసీపీ పార్టీ కోసం తాను కష్టపడి…
అమరావతి: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినీ రంగ సమస్యలపై జగన్‌తో చాలా విషయాలు చర్చించానని.. కానీ అవి ఇప్పుడు చెప్పనని.. సరైన వేదికపై మాట్లాడతానని తెలిపారు. విశాఖకు సినీ ఇండస్ట్రీని తరలించే విషయంపై అందరం సమావేశమై చర్చిస్తామని మంచు విష్ణు పేర్కొన్నారు. జగన్ తనకు వరుసకు బావ అయినా అన్న అని పిలుస్తానని ఆయన చెప్పారు. అటు…
ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం అసలు ప్రస్తుతం ప్రస్తావనలో లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘ సిఫారసుల మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా నిధులు ఇస్తున్నామని తెలిపారు. రెవిన్యూ డెఫిషిట్ గ్రాంట్ ఏపీకి ఎప్పటికప్పుడు ఇస్తున్నామని జీవీఎల్ తెలిపారు. ఏపీ అభివృద్ధిపై నిరంతరం శ్రద్ధ వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రకాశం జిల్లాను విస్మరించిందని.. వెలిగొండ విషయంలో ప్రస్తుత, గత ప్రభుత్వాలు…