విశాఖ ఉక్కు ఉద్యమం మరింత ఉధృతం అవుతోంది… కూర్మన్నపాలెం మెయిన్ గేటు వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ భరో నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి పీపుల్స్‌స్టార్ ఆర్ నారాయణ మూర్తి మద్దతు ప్రకటించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమం చేపట్టి ఏడాది అవుతున్న కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.. కార్మికుల ఉద్యమం పట్టించుకోదా..? ఏ ముఖం పెట్టుకొని విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణమూర్తి.. ఏ రాష్ట్రం, ఏ…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 24,066 శాంపిల్స్ పరీక్షించగా 896 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఆరుగురు కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. అనంతపురంలో ఇద్దరు, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.. ఇక, ఇదే సమయంలో 8,849 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,12,029 పాజిటివ్ కేసులు నమోదు…
ఆంధ్రప్రదేశ్‌లో కొంతకాలంగా కలకలం సృష్టిస్తోన్న సినిమా టికెట్ల వ్యవహారంతో పాటు.. సినీ పరిశ్రమను వేధిస్తోన్న మరికొన్ని సమస్యల పరిష్కారం కోసం.. తాజాగా, సీఎం వైఎస్ జగన్‌ను సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్‌స్టార్ ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి, నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి తదితరులు కలిసిన విషయం తెలిసిందే.. ఈ భేటీతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ఉన్నారు. అయితే, ఈ భేటీపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామంటూ రాష్ట్ర మంత్రులు స్పష్టంగా చెబుతున్నమాట.. అయితే, మూడు రాజధానుల అంశంపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు.. విజయవాడలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు చోట్ల రాజధానులు చేస్తామంటోందన్నారు. ఒక రాజధాని అమరావతిలోనే సరిగ్గా అభివృద్ధి జరగడంలేదు.. ఇలాంటి సమయంలో మూడు చోట్ల రాజధానుల ప్రతిపాదన సరైంది కాదన్నారు.. రెండు చోట్ల రాజధానులు పెట్టినా పర్వలేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం…
తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన అనంతరం పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విభజన సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న…
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తవుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకూ పోరాటం ఆపేది లేదని ప్రకటించిన కార్మికులు అదే స్ఫూర్తితో పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో దీనిపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. ఏడాదిగా పోరాటం చేస్తున్న విశాఖ ఉక్కు కార్మికులకు ఉద్యమాభివందనాలు చేస్తున్నానని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై పార్లమెంటు వరకు తమ పార్టీ…
భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఏపీ పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని దహనం చేయనున్నారు. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా రాష్ట్రంలోని వివిధ శాఖల సమన్వయంతో పాటు సరిహద్దు రాష్ట్రాల సహాయ సహకారాలతో విస్తృతంగా గంజాయి తోటలను ధ్వంసం చేసి.. గంజాయి సాగుపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. అనేక దశాబ్దాలుగా ఏవోబీతో పాటు గిరిజన గ్రామాలలో కొనసాగుతున్న గంజాయి సాగుపై గతంలో…
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మార్చి 18 నాటికి పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాలలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 15-17 మధ్య జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలు విధులు నిర్వర్తిస్తారు. కొత్త జిల్లాలకు ఉద్యోగులు, అధికారులను కేటాయించడం, మౌలిక వసతుల కల్పన, ఇతర చర్యలు పూర్తయ్యేంత వరకు…
సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి హడావిడిగా అరెస్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును శుక్రవారం అర్ధరాత్రి బెయిల్‌పై విడుదల చేశారు. సుమారు 18 గంటల పాటు సీఐడీ పోలీసులు తమ అధీనంలోనే ఉంచుకున్నారు. అనంతరం పోలీసులు విజయవాడ కోర్టుకు తరలించారు. సీఐడీ కోర్టు ఇంఛార్జి న్యాయమూర్తి సత్యవతి బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో అశోక్‌బాబును పోలీసులు విడుదల చేశారు. ఆయనకు రూ.20వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుతో సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు…