విశాఖ లోని అయోధ్య రామ మందిరం నమూనా సెట్ నిర్వాహకులకు ఉచ్చు బిగుస్తుంది.. ఆధ్యాత్మిక ముసుగులో కమర్షియల్ గా నిర్వహిస్తున్న రామ మందిరం వివాదం ముదురుతుంది.. అయోధ్య రామ మందిరం నిర్వాహకులపై రెండు ఫిర్యాదులు అందుకున్నారు విశాఖ త్రీ టౌన్ పోలీసులు.. ముగ్గురు నిర్వహకులుపై 318(4) r/w 3(5) BNS కింద త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది.. లిక్కర్ కేసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి కౌంటర్లు, సుపరిపాలన - తొలి అడుగుపై చర్చించింది మంత్రివర్గం.. మొత్తంగా 42 అజెండా అంశాలపై కేబినెట్లో చర్చ సాగింది..
మార్నింగ్ టైం బీమిలీ.. సాయంత్రం సంగం శరత్ గెస్ట్ హౌస్లో ట్రైనింగ్ ఉండేది.. ఇప్పుడు ఇవి అన్నీ చెప్పాను అనుకొండి.. పవన్ కల్యాణ్.. కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగాను అంటాడు.. విశాఖ వస్తే.. విశాఖలో తిరిగాను అంటాడు.. ఏ ఊరు వెళ్ళినా.. అక్కడ నేను ఉన్నా కొన్నాళ్ళు.. అంటాడు ఏమిటో.. అని విమర్శిస్తారు.. అయితే, నా పేరు పవన్... పవనంలా పయనిస్తూ ఉంటా.. ప్రతి చోటా నేనే ఉంటా.. మనం పవనాలం అయితే.. అవి "కూపస్థ మండూకాలు"…
ఈ సారి అమరావతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ సచివాలయం వెనక ప్రాంతంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనుంది కూటమి సర్కార్..
రోజువారి ప్రభుత్వ పరిపాలనలో ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి నారా లోకేష్.. విజయవాడ నోవాటెల్ హోటల్ లో ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ – ఆంధ్రప్రదేశ్ సదస్సులో సీఎం నారా చంద్రబాబు నాయుడతో కలిసి పాల్గొన్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఏఐ అండ్ డేటా సెంటర్లపై జరిగిన చర్చలో మాట్లాడుతూ.. డేటా విప్లవం ద్వారా…
రాజధాని ప్రాంతం అమరావతి రైతులకు తీపికబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రైతులకు సంబంధించిన 11వ ఏడాది కౌలు సొమ్మును విడుదల చేసింది సర్కార్.. 163.67 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులు ఓ దళిత యువకుడిపై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై స్పందించారు మంత్రి సుభాష్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మొన్న అమలాపురం ఘటనలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది డబ్బులు తీసుకున్నారు.. ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు దాడి చేశారని తెలిపారు.. అయితే, దాడి చేసినవారు. నా అనుచరులు అని వైసీపీ బ్యాచ్.. నా పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
నేను రౌడీనే.. అందుకే నా ఊరు బాగుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అందరూ మున్సిపల్ ఎన్నికలలో ఓడిపోతే.. నన్ను ఒక్కడినే గెలిపించారని గుర్తుచేశారు జేసీ.. ఇక, తాడిపత్రి ప్రజలు నాకు దేవుళ్లు.. వాళ్ల కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అన్నారు..
HHVM : పవన్ కల్యాణ్ నుంచి చాలా ఏళ్ల తర్వాత హరిహర వీరమల్లు సినిమా వస్తోంది. భారీ పాన్ ఇండియా మూవీగా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొన్నటి వరకు ఏ సినిమాకు లేనంతగా ప్రీమియర్స్ షోలు వేస్తున్నారు. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో భారీగా రేట్లు కూడా పెంచేశాయి. ఇక ప్రీమియర్స్ షోలకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ చూస్తే పవన్ రేంజ్ ఏంటో అర్థమైపోతోంది. ఇప్పుడున్న హవా చూస్తుంటే ప్రీమియర్స్ తోనే భారీ రికార్డులు…