లిక్కర్ అమ్మకానికి చంద్రబాబే రాచమార్గం వేశారని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ వ్యక్తులతో మద్యం అమ్మకాలు.. బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు చేస్తూ.. లిక్కర్ అమ్మకాలకు రాచమార్గం వేసిందే చంద్రబాబు అని విమర్శించారు.
విజయవాడ వర్షాల కారణంగా మళ్లీ బుడమేరు పొంగుతుంది.. అని సోషల్ మీడియా పోస్టులతో కొంతమంది హల్చల్ చేస్తున్నారు.. దీంతో, వర్షాలు పెరిగితే మళ్లీ బుడమేరు కట్ట తెగి.. మళ్లీ వరదలు వస్తాయి అని విజయవాడ వైస్సార్ కాలనీ వాసులు భయపడుతున్నారు. అయితే, సోషల్ మీడియాలో జరుగోతన్న ఈ తప్పుడు ప్రచారాన్ని కొట్టిపారేశారు పోలీసులు..
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటనకు బయలుదేరనున్నారు.. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ లతో కూడిన 8 మంది బృందం సింగపూర్ లో పర్యటించించనున్నారు.. ఈ నెల 26 నుంచి 31 తేదీ వరకు 6 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించి.. దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య గండికోట రహస్యంగా మారింది ... మైనర్ బాలిక హత్య జరిగి 11 రోజులు కావస్తున్నా ఇంకా తేలని వైనం.. అయితే ఈ కేసు పోలీసులకు సవాలుగా మారిందా ? రోజుకో మలుపు తిరుగుతూ మిస్టరీగా మారిందా.. గండికోట ను రోజు జల్లెడ పట్టిన ఆనవాళ్లు లభించలేదా? ఇంతకీ ఆ కోటలో ఏమి జరిగింది ?
మాజీ మంత్రి పేర్ని నానికి మరోసారి కోర్టులో ఊరట లభించింది.. ఈ నెల 31వ తేదీ వరకు పేర్ని నానిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు పొడిగించింది.. కాగా, మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసులు నమోదు అయ్యాయి.. దీంతో, ముందస్తు రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు నాని..
కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.. రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసే విధంగా ఇవాళ కేబినెట్లో నిర్ణయం జరిగిందన్నారు.. సుమారు 80 వేల కోట్ల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. దీని ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు..
ఇంట్లో పని అని చెప్పి తనతో భారతి అనే మహిళ వ్యభిచారం చేయించిందని ఆవేదన వెలిబుచ్చింది ఒక మహిళ.. అమ్మాయిలను బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదిస్తుందని, తాను పారిపోయే ప్రయత్నం చేస్తే నన్ను, నా బిడ్డను చంపుతానని బెదిరించిందని అంటుంది..
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో తన సింగపూర్ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేబినెట్ సమావేశంలో సింగపూర్ టూర్‌పై స్పందించిన సీఎం.. గత ప్రభుత్వం హయాంలో సింగపూర్‌పై దుష్ప్రచారం చేశారు.. సింగపూర్ మంత్రులపై తప్పుడు ఆరోపణలు చేశారు.. అయితే, మళ్లీ సింగపూర్ తో సంబంధాలు పునరుద్ధరణ కోసం ఈ టూర్ ఉపయోగపడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు..