పులివెందుల....పొలిటికల్‌గా ఈ పేరు చెప్పగానే.... ఏపీలో ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబమే. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాన్ని తమ కంచుకోటలా మలుచుకుంది ఆ ఫ్యామిలీ. అలాంటిచోట పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది టీడీపీ. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో... వైనాట్ పులివెందుల నినాదం ఇచ్చింది. మరి అలాంటి చోట ఆ పార్టీ తీరు ఎలా ఉండాలి? ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి?
జనసేనకు చెందిన కొందరి నేతల డర్టీ పనులు పార్టీపై ప్రభావం చూపిస్తున్నాయి. ప్రతిపక్షాలు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామాన్యులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. కొందరు నేతల డర్టీ వీడియోలు, లైంగిక ఆరోపణలు, కుటుంబ కలహాలు ఇలా ప్రతి సంఘటన కూడా ప్రత్యక్షంగా పార్టీపై ప్రతికూలంగా ప్రభావం చూపుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుండి 30 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్, అధికారులతో కూడిన బృందం నాలుగు రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులతో పాటు, అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం, పోర్టులు, సాంకేతిక, మౌళిక రంగాల్లో సింగపూర్ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సహకారం కోరనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
వేణుంబాకం విజయసాయిరెడ్డి.... ఒకప్పుడు వైసీపీలో నంబర్ టూగా ఓ వెలుగు వెలిగిన ఈ లీడర్ రాజకీయాల్లో డిఫరెంట్ పీస్ అని చెప్పుకుంటారు. చిన్న విషయాన్ని కూడా ఓ సంచలనంగా చెప్పడంలో సరిలేరు నాకెవ్వరూ..... అన్నట్టుగా ఉంటుందట ఆయన వ్యవహారం. ఈ క్రమంలోనే... తాజాగా ఆయన ఎక్స్‌లో పెట్టిన ఓ మెసేజ్.... పొలిటికల్ పండిట్స్‌కే గట్టి పని పెట్టిందంటున్నారు. ఏపీ మద్యం ముడుపుల కేసులో సిట్ విచారణకు హాజరు కావాల్సిన వేళ ఎక్స్‌లో మాజీ ఎంపీ పెట్టిన మెసేజ్…
తాడిపత్రిలో పోటీపోటీగా కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి తెలుగు దేశం పార్టీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దీంతో, రేపు ఏం జరగబోతోంది? అనేది ఉత్కంఠగా మారిపోయింది.. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా రేపు తాడిపత్రిలో వైసీపీ నిర్వహించదలిచిన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.. ఒకే రోజున రెండు పార్టీలు భారీగా సభలు నిర్వహిస్తే శాంతి భద్రతలకు ఆటంకం కలగవచ్చని భావించిన పోలీసులు.. వైసీపీ జిల్లా అధ్యక్షునికి కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నోటీసులు జారీ చేశారు..
మన ధర్మవరం చేనేత పట్టు చీరకు జాతీయ గుర్తింపు లభించింది.. దీనికి సంబంధించిన "ఒక జిల్లా ఒక ఉత్పత్తి" (ODOP – One District One Product)- 2024 అవార్డును ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ రోజు అందుకున్నారు మంత్రి సవిత, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.. అటవీ శాఖలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.. అటవీశాఖలో 691 బీట్ ఆఫీసర్.. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది.. ఈ నెల 16వ తేదీ నుండి ఆగష్టు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఇచ్చింది..