Marriage Fraud: బెజవాడలో నిత్య పెళ్లి కూతురు అను ఆగడాలపై పోలీసులు విచారణ చేపట్టారు. నగరంలో పబ్స్ వేదికగా అక్కడకు వచ్చే వారిని టార్గెట్ చేసుకుని అను ఈ పెళ్లిళ్ల మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
Minister Narayana: రైతులకు కేంద్రం ఇచ్చే 6 వేలతో కలిపి మొత్తం 20 వేలు ఇస్తామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తల్లికి వందనం పథకం ద్వారా 10 వేల కోట్లు విద్యార్ధుల తల్లుల ఖాతాలో జమ చేశామని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
Telangana AP water row on Banakacherla Project: ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు ససేమిరా అంటూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బనకచర్లపై జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీ అభ్యంతరాలు తెలిపాయని పేర్కొంది. ఇప్పటి వరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని తెలంగాణ సర్కార్ లేఖలో ప్రస్తావించింది. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలో…
East Godavari Tragedy: తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గత నాలుగు నెలలుగా తన కుమార్తె కనిపించడం లేదని మనస్థాపనతో కొవ్వూరులో ఓ మహిళ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.
Bobbili Tragedy: విజయనగరం జిల్లా బొబ్బిలిలో స్కూల్ విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న కొట్లాట ఒక విద్యార్థి ప్రాణం తీసింది. సుందరాడ కార్తీక్ అనే విద్యార్థి మృతికి అభ్యుదయ స్కూల్ మేనేజ్మెంట్ బాధ్యత వహించాలని అంబేద్కర్ పోరాట సమితి డిమాండ్ చేస్తోంది.
Train fraud AP: పల్నాడు జిల్లాలో నకిలీ టీటీఈ రైళ్లలో తిరుగుతున్నాడు. మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైల్లో జనరల్ బోగీల్లో తనికీలు నిర్వహించాడు.
ఏపీ ప్రతిపాదిత “బనకచర్ల ప్రాజెక్ట్” వివాదంపై రేపు అత్యున్నత స్థాయి సమావేశం జరుగనున్నది. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ నేతృత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి ఢిల్లీ కి చేరుకోనున్న ఏపి ముఖ్యమంత్రి.. రేపు ఉదయం ఢిల్లీకి రానున్న తెలంగాణ ముఖ్యమంత్రి.. తెలంగాణ వ్యతిరేకత, కేంద్ర అభ్యంతరాల నేపథ్యంలో చర్చ జరుగనుంది. అత్యున్నత స్థాయి (అపెక్స్ కమిటీ) సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.…
Tadipatri Tension: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పోటాపోటీ కార్యక్రమాలకు తెలుగుదేశం- వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలు పిలుపునిచ్చాయి.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈరోజు (జూలై 15న) ఉదయం 9.45 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11.45 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు.