* నేడు ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖర్ ప్రమాణస్వీకారం
* నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశం, కేబినెట్ ముందుకు వర్సిటీల చట్ట సవరణ ముసాయిదా బిల్లు, అన్ని వర్సిటీలకు కామన్ రిక్రూట్‌మెంట్‌కు అనుకూలంగా చట్ట సవరణ, ఇప్పటికే కామన్ బోర్డు ఏర్పాటు చేసిన సర్కార్
* నేడు బాపట్లలో సీఎం జగన్ పర్యటన, జగనన్న విద్యాదీవెన పథకం మూడో త్రైమాసిక నిధులను విడుదల చెయ్యనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
* విజయవాడ: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు
* అంబేద్కర్ కోనసీమలో నేడు కేంద్ర బృందం పర్యటన, గత నెలలో వచ్చిన వరదలు కారణం గా జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్న కేంద్ర బృందం, కొత్తపేట, పీ గన్నవరం, రాజోలు నియోజకవర్గాలు లో జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్న బృందం
* హైదరాబాద్: నేడు ఉదయం 10.30 గంటలకు మునుగోడుపై కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ, మధ్యాహ్నం ఒంటి గంటకు వర్కింగ్ ప్రెసిడెంట్లతో సమావేశం, మధ్యాహ్నం 3 గంటలకు అనుబంధ సంఘాల చైర్మన్లతో సమావేశం
* తిరుమలలో ఇవాళ డయల్ యూవర్ టీటీడీ ఈవో కార్యక్రమం
* నేడు రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ , పాల్గొననున్న రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
* తూర్పుగోదావరి జిల్లా : కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ , ఇప్పటికీ 81 రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న అనంతబాబు
* తూర్పుగోదావరి జిల్లా : వరద ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ప్రజల సహాయార్థం కలెక్టరేట్ లో 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా వరద సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. నెంబర్ 8977935609.. ఈనెల 17 వరకు రెండు షిఫ్ట్ ల్లో సిబ్బంది నియమకం
* విశాఖ: నేడు గాజువాకలో హర్ ఘర్ క తిరంగా ర్యాలీ… భారీ జాతీయ పతాకం ప్రదర్శించనున్న విద్యార్థులు… ర్యాలీకి ముఖ్య అతిథిగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు.
* విశాఖ: నేడు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మీటింగ్… స్వాతంత్ర్య ఉద్యమం, కమ్యూనిస్టుల పాత్రపై చర్చ
* కర్నూలు: నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకోనున్న కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప.
* నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి శ్రావణానక్షత్రపూజలు, లక్షకుంకుమార్చన, ప్రత్యేక పూజలు
* కర్నూలు: ఆలూరు మండలం ముసాన్ పల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం కళసం ప్రతిష్టాపన…
* నేడు కాకినాడ లో జరిగే బీజేపీ యువ సంఘర్షణ బైక్ యాత్ర లో పాల్గొనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
* పల్నాడు జిల్లా: నేడు దుర్గిలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పుల్లరి ఉద్యమనేత కన్నెగంటి హనుమంతు ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్న పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.
* విజయనగరం: పోరాం గ్రామం నందు నేడు రీ సర్వే.. గ్రామసభ..