తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లా పర్యాటనలో అపశృతి చోటు చేసుకుంది.. రాజోలు మండలం సోంపల్లి రేవులో బోటు దిగుతుండగా నీటిలో పడిపోయారు టీడీపీకి చెందిన 15 మంది నేతలు.. చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది.. మాజీ మంత్రులు, టీడీపీ నేతలు నీటిలో పడిపోయారు.. దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, రాధాకృష్ణ, అంగర రామ్మోహన్, మంతెన రామరాజు నీటిలో పడి తడిసి ముద్దయ్యారు.. ఇందులో పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.. నీటిలో పడినవారిలో పోలీసు…
ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి గత ప్రభుత్వం అప్పులు చేసిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ.. ఒక దేశాన్ని తీసుకుని రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులుకు ముడిపెట్టడం మంచిది కాదన్నారు. శ్రీలంకలో వ్యవసాయ ఉత్పత్తి పడిపోయి దిగుమతులుపై ఆధారపడ్డారని.. దీంతో, శ్రీలంక జీడీపీ పడిపోయింది.. విదేశీ మారక ద్రవ్యంపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. ఒక దేశంలో ఇలాంటి పరిస్థితి రాష్ట్రానికి వర్తించదని స్పష్టం చేశారు. అయితే, శ్రీలకం పరిస్థితులను చూసిన తర్వాత దేశంలో…
పని చేయడం చేతగాకపోతే స్వచ్ఛందంగా తప్పుకోండి.. లేదా మేమే తొలగిస్తాం అంటూ గ్రామ, సచివాలయ వాలంటీర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
తెలుగు రాష్ట్రాల్లో 13 మంది యువతులను పెళ్ళి చేసుకుని మోసం చేసిన నిత్యపెళ్ళి కొడుకు శివశంకర్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులో తీసుకున్నారు. శివశంకర్‌పై హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, గుంటూరు, విజయవాడలో కేసులు నమోదయ్యాయి. శివశంకర్ ను అరెస్ట్ చేయాలని బాధిత మహిళలు రోడ్డెక్కడంతో వ్యవహారాన్ని సీరియస్ తీసుకున్నారు పోలీసులు. అమెరికాలో ఉన్న యువతిని సైతం మోసం చేసి, ఆ యువతి నుంచి 35 లక్షలు వసూలు శివశంకర్ వసూలు చేసాడని విచారలో తేలిందని పోలీసులు తెలిపారు.…
Chandra Babu Fires on YCP Leaders: ఆంధ్రప్రదేశ్‌ను ప్రతిపక్షాలు శ్రీలంకతో పోల్చడంపై వైసీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీలంకలో ఉన్న దుర్భర పరిస్థితులే ఏపీలో ఉన్నాయని.. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటి నుంచో సకాలంలో జీతాలు చెల్లించట్లేదని, తమ జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకునే పరిస్థితుల్లో ఉద్యోగులు లేరని…