తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద క్రమేపి గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. గంటకు ఒక పాయింట్ వంతున నీటిమట్టం తగ్గుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరోవైపు 37 రోజులుగా లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో లంకవాసుల వరద కష్టాలు తగ్గడం లేదు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి క్రమేపీ తగ్గుతుంది.
ఎగువ ప్రాంతాల్లో నీటిమట్టాలు తగ్గుతున్న కారణంగా బ్యారేజీ వద్ద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 15 పాయింట్ 4 అడుగులకు తగ్గింది. గంటకు ఒక పాయింట్ వంతున తగ్గుముఖం పట్టింది. బ్యారేజీ నుండి 15 లక్షల క్యూసెక్కుల వరదనీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో లోతట్టు ప్రాంతాలు లంక గ్రామాల ప్రజలు, ఊపిరి పీల్చుకుంటున్నారు. గోదావరి ఎగువ ప్రాంతంలోని 4 విలీన మండలాలు, దిగువన కోనసీమ లంక గ్రామాలకు గడిచిన 37 రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్న చిక్కుకున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇంకా రెండో ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తుంది. కోనసీమలోని లంక గ్రామాల రహదారులు నీట మునిగాయి. కాజ్వేల్ పై నుండి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోనసీమలో ప్రస్తుతం పడవలపైనే లంక గ్రామస్తులు ప్రయాణం సాగిస్తున్నారు. గత నెలలో వచ్చిన వరద పూర్తిగా ఇళ్లను సైతం నీట ముంచింది. మళ్ళీ ఇప్పుడు నీటిలో ఉండటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారులు వరద నీటిమట్టం తగ్గడంతో సహాయక చర్యలు నిలిపివేశారు. దీనితో నదీ పరివాహక ప్రాంతంలోని వరదలో చిక్కుకున్న లంక గ్రామాల ప్రజలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ ఎగువన ముంపు మండలాలైన చింతూరు ,కూనవరం, విఆర్ పురం, ఎటపాకలలో అనేక ముంపుగ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒడిషా, ఛత్తీస్ ఘడ్ జాతీయ రహదారులపై వరద నీరు చేరడంతో రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బారులు తీరిన లారీలు గత వారం రోజులుగా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. రవాణా వ్యవస్థ స్తంభించింది. డ్రైవర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: Trisha: రాజకీయాల్లోకి త్రిష.. ఏ పార్టీలో చేరుతుందో తెలుసా?