కాకినాడ జిల్లాలో పేలుడు సంభవించింది.. కాకినాడ రూరల్ వాకలపూడిలోని ప్యారి షుగర్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది.. లారీలకు లోడు చేసే కన్వియర్ బెల్ట్ పేలినట్లు సమాచారం… ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు.. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు.. అయితే, మృతిచెందిన కార్మికుల కుటంబాలను ఆదుకోవాలని ఆందోళనకు దిగారు కార్మికులు.. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని.. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. ఇక, ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కురసాల కన్నబాబు.. జిల్లా ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: Harassment : అప్పు ఇస్తా.. గెస్ట్ హౌస్‌కు వస్తా.. న్యూడ్ కాల్ చేస్తావా..