ysrcp mp talari rangaiah comments about debts in ap government: ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. అప్పుల కారణంగా ఏపీ మరో శ్రీలంక కాబోతుందని ప్రచారం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను వైసీపీ ఎంపీలు తాజాగా ఖండించారు. ఈ మేరకు ఢిల్లీలో వైసీపీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. ఏపీలో అవినీతి లేని పాలనను జగన్ ప్రజలకు అందిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజలకు వందకు వంద రూపాయలు నేరుగా చేరుతున్నాయని……
New judges to AP High court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు త్వరలోనే ఏడుగురు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. ఈ మేరకు ఏపీ హైకోర్టుకు నూతన న్యాయమూర్తులను సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. ఏడుగురు న్యాయాధికారులకు జడ్జీలుగా కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన న్యాయమూర్తుల జాబితాలో అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ, బండారు శ్యామ్సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహలక్ష్మీనరసింహ, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ ఉన్నారు. కాగా…
గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో.. మరోసారి పోలవరం ప్రాజెక్టు, పోలవరం ముంపు ప్రాంతాల వివాదం తెరపైకి వచ్చింది.. ఆంధ్రప్రదేశ్లో కలిపిన మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని, పోలవరం ఎత్తును తగ్గించాలనే డిమాండ్ తెలంగాణ నుంచి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి వినిపిస్తుండగా.. ఏపీ నుంచి దీనిపై కౌంటర్లు పేలుతున్నాయి.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పోలవరం మీద తెలంగాణతో పాటు ఢిల్లీ వాళ్లు దిగివచ్చినా..…
ఎంతో కాలంగా నా పేరుతో నకిలీ కారు స్టిక్కర్ ను ఉపయోగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఎంపీ స్టిక్కర్ పేరుతో బెదిరింపులు, మోసాలకు పాల్పడుతున్నారని తన సోదరుడిపై ఆరోపణలు గుప్పించారు ఎంపీ కేశినేని నాని
రాష్ట్రా రూపురేఖలే కాదు.. పోర్టులు ఉన్న ప్రాంతాల రూపురేఖలు త్వరలోనే మారబోతున్నాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రామాయపట్నం పోర్టు పనులకు భూమిపూజ చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.. చెన్నై అయినా, విశాఖ అయినా, ముంబై అయినా మహానగరంగా ఎదిగాయంటే అక్కడ పోర్టులు ఉన్నాయని గుర్తుచేసిన ఆయన.. పోర్టు రావడం వల్ల ఉద్యోగావకాశాలు వస్తాయి, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి, పోర్టు వల్ల ట్రాన్స్పోర్టు ఖర్చుకూడా బాగా తగ్గుతుంది.. రాష్ట్రానికే కాదు,…
మెగాస్టార్ చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ క్షమాపణ చెప్పినా.. ఆయనకు మాత్రం నిరసన సెగ తప్పడంలేదు.. కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న నారాయణకు మెగా అభిమానుల నుంచి నిరసన ఎదురైంది.. ఆలమూరు మండలం బడుగువానిలంకలో వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన, బాధితుల పరామర్శకు వెళ్తున్న నారాయణను అడ్డుకోవడానికి యత్నించారు మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు.. చిరంజీవి పై నారాయణ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.. చిరంజీవికి…