Trains Cancelled: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.. మరి కొద్ది గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.. ఇక, వాయుగుండం ఎఫెక్ట్‌తో ఉత్తరాంధ్రవ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది.. ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. గడచిన 24 గంటల్లో విశాఖలోని కాపులుప్పాడలో 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.. విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరంజ్ ఎలెర్ట్ జారీ అయ్యింది.. నేడు పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్య అవకాశం ఉండగా.. తీరం వెంబడి ఈదురు గాలుల ప్రభావం కొనసాగుతోం.. కోస్తా తీరం వెంబడి పోర్టులకు మూడవ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు..
Read Also: New Born Baby: 2 గుండెలు, 2 తలలు, 2 కాళ్లు, 4 చేతులతో వింత శిశువు జననం!
అయితే, వాయుగుండం ఎఫెక్ట్‌తో అప్రమత్తమైన తూర్పు కోస్తా (తూ.కో.) రైల్వే శాఖ.. కేకే లైన్‌లో పలు రైళ్లు దారి మళ్లించింది.. మరికొన్ని రైళ్లు రద్దు చేసినట్టు ప్రకటించారు..మరోవైపు, అరకు పర్యాటక రైలు ఇవాళ, రేపు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.. ఇక, దారిమళ్లిన రైళ్లను పరిశీలిస్తే.. 18515 విశాఖ – కిరండోల్ నైట్ ఎక్స్ ప్రెస్ ను దారిమళ్లించారు.. ఇప్పటికే అరకు చేరుకున్న 58501 విశాఖ – కిరండోల్ రైలును వెనక్కి రప్పిస్తున్నారు అధికారులు..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
మరోవైపు, అల్లూరి ఏజెన్సీలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.. మత్స్య గడ్డ ఉధృతంగా ప్రవహించడంతో పరివాహక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి… పలుచోట్ల వరి పొలాలు వర్షపు నీటితో కొట్టుకుపోయాయి… పాడేరు నుండి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారి వద్ద కల్వర్టుపై నుండి కొండబవాగు ప్రవహించడంతో చింతపల్లి నుండి పాడేరుకి రాకపోకలు స్తంభించాయి… పెదబయలు మండలంలో వరదని పుట్టు వద్ద వాగు ఉధృతి అధికంగా ఉండడంతో 50 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.. హుకుంపేట మండలం చేదుపుట్టు వద్ద వంతెన పైనుండి నీరు ప్రవహించడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి… పెదబయలు మండలంలో జామి కూడా వద్ద కొండ వాగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో స్థానిక గిరిజనులు గ్రామాలకు పరిమితమయ్యారు… ముంచంగిపుట్టు మండలంలో ఉబెంగుల లక్ష్మీపురం రంగబయలు వంటి ప్రాంతాల వద్ద కొండవాగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో స్థానిక గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు… ఏజెన్సీలో పలు పర్యటక జలపాతాలు వద్ద నీటి ఉధృతి పెరగడంతో ప్రమాదకరంగా జలపాతాలు దర్శనమిస్తున్నాయి…