ఈ రోజు ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో గర్భిణికి డోలీమోత తప్పలేదు.. అనంతగిరి మండలంలోని మారుమూల పెదకోట పంచాయతీ చింతలపాలెం గ్రామానికి రహదారి సౌకర్యం లేక నిండు గర్భిణిని ఆస్పత్రికి డోలీలో తరలించిన సంఘటన చోటుచేసుకుంది.
పార్వతీపురం మన్యం జిల్లాలో సగం ధరకే బంగారం అంటూ ఘరానా మోసం చేశారు. 12 లక్షల రూపాయల నగదుతో పరారయ్యారు కేటుగాళ్లు.. దీంతో, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రాంతానికి చెందిన బాధితురాలు శ్రీలక్ష్మి లబోదిమోమంటోంది..
విజయవాడ నగరవాసులను మరోసారి బుడమేరు వరద టెన్షన్ పెడుతుంది.. గత ఏడాది ఇదే సమయంలో నగరాన్ని ముంచెత్తింది బుడమేరు వరద.. భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.. అదో పీడకలగా మారిపోయింది.. అయితే, రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలుచోట్ల పొంగి ప్రవహిస్తోంది బుడమేరు.. గుణదల ఒకటవ డివిజన్ లోని వంతెనపై నుంచి బుడమేరు ప్రవహిస్తోంది.. దీంతో, వంతెనపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది..
కడప జిల్లాలో ఆసక్తికరంగా మారిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నేడు ఫలితాలు తెలిపోనున్నాయి.. కడప రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.. జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది..
తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఇటీవల కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన వివరించిన ప్రకారం, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని అవసరమైన అనుమతులు ఇప్పటికే జారీ చేసింది.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం దుప్పలపూడి గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన కలకల రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. దుప్పలపూడి గ్రామంలో ఒక పౌల్ట్రీ ఫారంలో పనిచేస్తున్న మైనర్ బాలిక (16) కు వ్యాన్ డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మాయ మాటలతో ఆ బాలికను లోబరుచుకున్నాడు. ఈనెల తొమ్మిదో తారీఖున అర్ధరాత్రి సమయాన బాలికను బైక్ పై అపహరించుకుపోయాడు వ్యాన్ డ్రైవర్. Also Read:Supreme Court : పర్యావరణాన్ని…
కొందరి పోలీసుల ప్రవర్తన పవిత్రమైన, బాధ్యతకలిగిన వృత్తికి మాయని మచ్చగా మారుతోంది. బాధితుకు న్యాయం చేకూరాల్సిందిపోయి.. అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. ముదిగుబ్బ మండలంలోని పట్నం స్టేషన్ ఎస్సై రాజశేఖర్ ఓ మహిళను లైంగికంగా వేధించాడు. తన కోరిక తీరిస్తే కేసులో న్యాయం చేస్తానని, లేకపోతే ఇబ్బందులు తప్పవని ఓ గిరిజన మహిళను బెదిరించాడు. గరుగుతండాకు చెందిన ఓ మహిళ తమ బంధువులతో కలిసి విడాకుల కేసు విషయంపై రెండు నెలల కిందట పోలీసులను ఆశ్రయించింది. Also Read:Team india…