* నేడు ఉదయం 11.30 గంటలకి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవం.. హబ్ ను వర్చువల్ గా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. స్టార్టప్ కంపెనీలకి మౌలిక సదుపాయల కల్పన.. ఆర్థిక పరమైన వనరుల సహకారం అందించనున్న ఇన్నోవేషన్ హబ్..
* నేడు శ్రీశైలంలో మంత్రి సంధ్యారాణి పర్యటన.. గిరిజన మ్యూజియంలో బహుళార్ధసాధక మార్కెటింగ్ కేంద్రానికి శంకుస్థాపన.. ఆత్మకూరులో నన్నారి ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించనున్న మంత్రి సంధ్యరాణి..
* నేడు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న కాకాణి గోవర్థన్ రెడ్డి.. 86 రోజుల నుంచి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణి.. నిన్న బెయిల్ పత్రాలు సమర్పించడం ఆలస్యం కావడంతో ఇవాళ విడుదల..
* నేడు వల్లభనేని వంశీ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ.. 2 కేసుల్లో బెయిల్ షరతులు సడలించాలని వంశీ పిటిషన్లపై ఇవాళ విచారణ..
* నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఉదయం 10.30 గంటలకు సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్న సీఎం.. ఉదయం 11 గంటలకు గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ బిల్డింగ్ కు శంకుస్థాపన..
* నేడు కొమురం భీం జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన.. దహెగాం మండలం పెసర్ కుంట గ్రామంలో వర్షాలతో దెబ్బ తిన్న రోడ్లు, పంట పోలాలను పరిశీలించనున్న మంత్రి.. పంట నష్టపోయిన రైతులతో మాట్లడనున్న జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు..
* నేడు ఉత్తర తెలంగాణలోని పలు ప్రాజెక్టులను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మిడ్ మానేరు ప్రాజెక్టుల సందర్శన..
* నేడు మరోసారి ఫిల్మ్ ఛాంబర్ తో ఫెడరేషన్ చర్చలు.. ఉదయం నిర్మాలతో, సాయంత్రం ఫెడరేషన్ తో ఫిల్మ్ ఛాంబర్ భేటీ.. ఛాంబర్ కు మా సమస్యలు వివరించాం..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం..
* నేడు ఎన్డీయే కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు.. ఉదయం 11.15 గంటలకి నామినేషన్ దాఖలు చేయనున్న రాధాకృష్ణన్..
* నేడు లోక్ సభ ముందుకు నాలుగు కీలక బిల్లులు.. జమ్ముకశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా కల్పించే దిశగా కేంద్రం చర్యలు.. జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్న కేంద్రం.. లోక్ సభలో పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్న అమిత్ షా..
* నేడు లోక్ సభ ముందుకు 113వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025.. సభ ముందుకు రానున్న గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు.. ఆన్ లైన్ గేమింగ్ బిల్లును సభలో ప్రవేశ పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం..