మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.. మంత్రులు ఏడాది కాలంలో మెరుగ్గా పనిచేశారు.. ఇక నుంచి పరిపాలనలో దూకుడు పెంచాలని సూచించారు.. తప్పుడు వార్తలు నిజం చేసే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోంది.. వైసీపీ నేతల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు..
కేబినెట్లో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు మంత్రుల తో ప్రస్తావించారు.. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉందన్నారు సీఎం చంద్రబాబు. దర్యాప్తు ఆధారంగా అరెస్టులు ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు.. అయితే, లిక్కర్ కేసు విషయంలో మంత్రులు ఆచి తూచి స్పందించాలన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు లేఖ రాసింది సీపీఐ(ఎం).. కేంద్రం నుంచి వచ్చిన 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.1,121 కోట్లు వెంటనే పంచాయితీలకు విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచుల వేతనాలు పెంచాలని, గ్రామ సమస్యలు పరిష్కారం చేయాలని పవన్ కల్యాణ్కు రాసిన లేఖలో పేర్కొన్నారు..
ఏపీ కేబినెట్ సమావేశంలో తన సింగపూర్ పర్యటనకు సంబంధించిన వివరాలను మంత్రులకు వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సింగపూర్ పర్యటన వివరాలు గురించి కేబినెట్ సమావేశంలో సహచర మంత్రులకు చెప్పారు.. వైఎస్ జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి రానని చెప్పారు.. సీడ్ క్యాపిటల్ లో భాగస్వామ్యం కాబోం అన్నారు.. అక్కడకు వెళ్లి సింగపూర్ మంత్రులను ఆనాడు జగన్ ప్రభుత్వ పెద్దలు బెదిరించారు.. కేసులు పెడతాం అని భయపెట్టారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమవేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఆగస్టు 15 నుండి స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా అమలు చేయబోతున్నారు.. ఇక, ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ (లిప్ట్) పాలసీ 4.0... 2024-29కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.. 22 ఏపీ టూరిజం డెవలప్మెంట్ హోటళ్లు, ఆరు క్లస్టర్ల పరిధిలోని రిసార్టుల…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా డోన్ పర్యటనకు వెళ్లారు.. అయితే, వైఎస్ జగన్ డోన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.. వెల్దుర్తి హైవేపై టైరు పేలి ట్రాలీ ఆటో బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో ఆరుగురి పరిస్థితి విషమంగా మారగా.. మొత్తం 30 మందికి గాయాలు అయ్యాయి..
నేడు వివాహ వ్యవస్థపై కూడా నమ్మకం పోతుంది అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మన కుటుంబ, వివాహ వ్యవస్థ చూసే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయి.. ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు.. కెమిస్ట్రీ బాగొలేదని విడాకులు తీసుకుంటున్నారు ఇప్పుడు అని విమర్శించారు.
Drug Abuse: వాణి నగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న చెట్లు పొదల మధ్య ఆరుగురు యువకులు మత్తు ఇంజక్షన్లు చేతికి ఎక్కించుకుంటున్న విజువల్స్ డ్రోన్ కెమెరా గుర్తించింది. వెంటనే స్పందించిన స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు.