Off The Record: డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కీలక నియోజకవర్గం కొత్తపేట. ఇక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీలకు సొంత అన్నదమ్ములే ఇంఛార్జీలు. వారే మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం.. బండారు శ్రీనివాస్. ఇద్దరికీ అస్సలు పడటం లేదు. ఒక చిన్న వివాదం అపోహలతో పెరిగి పెద్దదై పరస్పరం పోటీకి దిగే స్థాయికి చేరింది. 2019 ఎన్నికల్లో ఇద్దరూ అదే చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి సత్యానందం.. జనసేన నుంచి శ్రీనివాసరావు బరిలో ఉండాలని చూస్తున్నారు.…
వైఎస్సార్ సెంటిమెంట్ లాగానే.. సీతక్క నియోజకవర్గం నుంచే యాత్ర ప్రారంభించా.. రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చానని, హాత్ సే హాత్ జోడో యాత్రలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. 20 శాతం మైనార్టీలు, 80శాతం మెజార్టీలను విభజించి పాలించిన విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. విభజించు పాలించు విధానంతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ ప్రయత్నాన్ని.. ప్రజలకు చాటి చెప్పేలాగా రాహుల్ గాంధీ యాత్ర చేశారన్నారు. రాహుల్ గాంధీ…
Polavaram Hydro Power Project: పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు ఆ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న హైడ్రో పవర్ ప్రాజెక్టుపై కూడా కేంద్రం క్లారిటీ వచ్చింది.. పోలవరం ప్రాజెక్టులో భాగంగా 5338 కోట్ల వ్యయంతో చేపట్టిన 960 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం 2026 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో ఏపీ జెన్కో ఉందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.. ఇవాళ రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ…
పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. ! ఓవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఫైర్ అవుతూనే.. మరోవైపు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. నన్ను నమ్ముకున్న వారి మనస్సులో ఏ పార్టీ ఉందో .. వారి అభీష్టానికి మేరకే పార్టీ మారుతాను. ఎవరో ఉరికిస్తే తొందరపడి ఏ పార్టీలో చేరను అన్నారు. తెలంగాణ వస్తే నీళ్లొస్తాయని, గిరిజనుల సమస్యలు తీరుతాయని భావించారు.. కానీ, అవేమి నెరవేరలేదు.. యావత్తు…
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల దీర్ఘకాలిక పదవీ విరమణ సమస్యను పార్లమెంట్లో లేవనెత్తారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిబద్ధత మరియు కృషిని కొనియాడుతూనే.. ఉద్యోగుల సమస్యలను పార్లమెంటులో ఉక్కు శాఖ మంత్రిని గట్టిగా నిలదీశారు.. విశాఖ ఉక్కు కర్మాగారంగా పేరొందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పదవీ విరమణ జరుగుతున్న ఉద్యోగుల సమస్య వలన క్షీణిస్తున్న…
Ali: రానున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. 175కి 175 స్థానాల్లో విజయమే టార్గెట్గా పెట్టుకున్నారు.. కొన్ని చోట్ల సిట్టింగ్లకు షాక్ తప్పదనే ప్రచారం కూడా సాగుతోంది.. దీంతో.. ఈసారి మాకు అవకాశం వస్తుందని ఎదురుచూసేవాళ్లు లేకపోలేదు.. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు ఆలీ.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఆర్పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు ఆలీ..…