Harirama Jogaiah: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. కాపులపై వైసీపీ చిన్నచూపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harirama Jogaiah: ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అయితే, వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కాపులపై చిన్న చూపుతో వ్యవహరించిందంటున్నారు మాజీ మంత్రి కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు చేగుండి హరిరామ జోగయ్య.. శాసనసభ స్థానాలలో రాయలసీమ నుండి బలిజ సామాజిక వర్గానికి చెందిన సుమారు 15 లక్షల మంది ఉన్నప్పటికీ కేవలం ఒకే ఒక స్థానాన్ని కల్పించారని విమర్శించారు.. రాయలసీమకు చెందిన బలిజ కులస్తులను ఒక్కరికి కూడా టీటీడీలో బోర్డులో సభ్యులుగా సైతం స్థానం కల్పించలేదన్న ఆయన.. జనాభా ప్రాతిపదికన ఈ రోజున కేటాయించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు 18లో కనీసం ముగ్గురు నైనా కాపు అభ్యర్థులను నియమించాలి ఒకే ఒక్క స్థానం మాత్రమే కేటాయించారంటూ తన లేఖలో పేర్కొన్నారు హరిరామ జోగయ్య.
Read Also: Akkineni Nagarjuna: ఆ రీమేక్ పైనే నాగ్ ఆశలన్నీ.. వర్క్ అవుట్ అయ్యేనా..?
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
కాగా, ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, స్థానిక కోటాలో 9 మంది అభ్యర్థులు, గవర్నర్ కోటాలో మరో ఇద్దరి పేర్లను ప్రకటించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక, మొత్తం 18 స్థానాలకు వైసీపీ ప్రకటించిన అభ్యర్థులను సామాజిక తరగతుల వారీగా చూస్తే.. బీసీలు 11, ఎస్సీలు 2, ఎస్టీ 1, వోసీలకు 4 స్థానాలు కేటాయించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాల్లోకి వెళ్తే.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు.. నత్తు రామారావు- శ్రీకాకుళం, లోకల్ కోటా (బీసీ, యాదవ), కుడుపూడి సూర్యనారాయణ- తూర్పు గోదావరి, లోకల్ కోటా (బీసీ-శెట్టి బలిజ), వంకా రవీంద్రనాథ్ – పశ్చిమ గోదావరి, లోకల్ కోటా (పారిశ్రామికవేత్త), కవురు శ్రీనివాస్ – ప.గోదావరి, లోకల్ కోటా( బీసీ-శెట్టి బలిజ), మేరుగ మురళి – నెల్లూరు, లోకల్ కోటా (ఎస్సీ-మాల), డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం-చిత్తూరు, లోకల్ కోటా, రామసుబ్బారెడ్డి – కడప, లోకల్ కోటా (ఓసీ-రెడ్డి), డాక్టర్ మధుసూదన్ – కర్నూలు, లోకల్ కోటా (బీసీ-బోయ), ఎస్. మంగమ్మ- అనంతపురం, లోకల్ కోటా( బీసీ-బోయ).. మరోవైపు.. ఎమ్మెల్యే కోటా అభ్యర్థుల విషానికి వెళ్తే.. పెనుమత్స సూర్యనారాయణ- విజయనగరం, ఎమ్మెల్యే కోటా( క్షత్రియ సామాజిక వర్గం) , పోతుల సునీత- ప్రకాశం, ఎమ్మెల్యే కోటా (బీసీ- పద్మశాలి) , కోలా గురువులు-విశాఖ, ఎమ్మెల్యే కోటా (ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్), బొమ్మి ఇజ్రాయిల్.. తూర్పు గోదావరి, ఎమ్మెల్యే కోటా ( ఎస్సీ-మాదిగ), జయమంగళ వెంకటరమణ- ప. గోదావరి, లోకల్ కోటా (వడ్డీల సామాజిక వర్గం), ఏసు రత్నం- గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( బీసీ-వడ్డెర), మర్రి రాజశేఖర్- గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( కమ్మ), ఇక, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయానికి వస్తే.. కుంభా రవి- అల్లూరి జిల్లా, (ఎస్టీ), కర్రి పద్మశ్రీ- కాకినాడ, (బీసీ)గా ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!