AP Crime: ఓ హత్య కేసులో చుట్టూ తిరిగే దృశ్యం సినిమాలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చూపించారు దర్శకుడు.. ఈ తరహా ఘటనలు ఇప్పటికే పలు ప్రాంతాల్లో వెలుగు చూశాయి.. తాజాగా, కృష్ణ జిల్లాలోనూ అలాంటి ఘటనే వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకును హత్య చేసింది ఓ కసాయి త్లి.. రోకలిబండతో కొట్టి కొడుకు దీప్‌చంద్‌ను హత్య చేసిన ఆమె.. ఎవరూ చంపేశారంటూ అందరినీ నమ్మించే…
Kethireddy Pedda Reddy: 2024 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తాడిపత్రిలో జేసీ సోదరులు బిచ్చమెత్తుకోవాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తన పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నేను పాదయాత్ర చేస్తుంటే.. జేసీ కరపత్రాలు పంచుతున్నాడని మండిపడ్డారు.. జేసీ సోదరులకు సవాల్ విసురుతున్నాను… నా మీద, నా కుటుంబసభ్యుల మీద అక్రమ కేసులు పెడితే, దానికి మ్యూల్యం మీ ఇంటి నుంచి మొదలు అవుతుందని హెచ్చరించారు..…
AP Police humanity: ఆస్పత్రిలో కన్నుమూసిన భార్యను ఇంటికి చేర్చడానికి ఓ భర్త దగ్గర డబ్బు లేదు.. ఇక చేసేది ఏమీ లేదు.. గమ్యం మాత్రం చాలా దూరం.. అయినా కట్టుకున్న భార్య మృతదేహాన్ని తన ఊరికి చేర్చాలనుకున్నాడు.. విజయనగరం జిల్లాలోని నీరుకొండ ఆస్పత్రి నుంచి తన భార్య మృతదేహాన్ని భూజాలపై వేసుకొని బయల్దేరారు.. సమాచారం అందుకున్న విజయనగరం రూరల్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు.. Read Also: PM Narendra Modi: ప్రజలు చేయలేనిది ఈడీ చేసింది..…
Thopudurthi Prakash Reddy: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి.. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు రాస్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి.. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర వెల వెల పోతుంటే ఎమ్మెల్యే పెద్దారెడ్డి యాత్ర గ్రాండ్ సక్సెస్ గా సాగిందన్నారు..…
Rama Siva Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కలకలం సృష్టించాయి.. అయితే, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు విషయాన్ని బయటపెట్టారు కోటంరెడ్డి స్నేహితుడు.. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇవాళ మీడియాతో మాట్లాడారు కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి.. ట్యాపింగ్ ఆరోపణలను ఖండించారు. ఇది ట్యాపింగ్ కాదని స్పష్టం చేశారు.. నా ఫోన్ కేంద్ర హోంశాఖకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు రామశివారెడ్డి.. అది ట్యాపింగ్ ఆడియో…
తంత్రాలు అయిన కుతంత్రాలైన బీజేపీకే సాధ్యం ఇవాళ ఉభయసభల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగతుంది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం నాడు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ… 5,375 కోట్లు ఇవ్వాలని ఫైనాన్స్ కమిషన్ చెప్పినా కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఫైనాన్స్ కమిషన్ చెప్పినా పట్టించుకోని ఏకైక ప్రభుత్వం మోడీ సర్కార్ అని ఆయన మండిపడ్డారు. సెస్‌ల రూపంలో కేంద్రం వసూలు చేస్తుందని, అప్పుల విషయంలో…
Phone Tapping Issue: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. ఫోన్ ట్యాపింగ్ లాంటిది లేదని అంటూనే.. అసలు ట్యాపింగ్ చేస్తే వచ్చిన నష్టం ఏంటి? అంటూ కొందరు నేతలు ప్రశ్నించడం కూడా చర్చగా మారిపోయింది.. అయితే, ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. ఈ వ్యవహారంపై స్పందించారు.. ఎవరి ఫోన్ అయినా ట్యాపింగ్ చేసే అధికారం ప్రభుత్వాలకు లేదన్న ఆయన.. ఫోన్లు ట్యాపింగ్ చేస్తే…
Off The Record: శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్ మంత్రి ధర్మాన ప్రసాదరావు. సమస్య ఏదైనా.. సందర్భం ఎలాంటిదైనా.. బహిరంగ సభైనా.. అసెంబ్లీలోనైనా ధర్మాన ప్రసంగం ఒబ్బిడిగా.. సోది లేకుండా ఉంటుంది. ఈ విషయంలో విమర్శకుల ప్రశంసలు సైతం ధర్మానకే. ఆహార్యంలోనే కాదు.. మాటలోనూ గాంభీర్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ప్రసాదరావు ఇప్పుడు ప్రసంగాల్లో హుందాతనం కోల్పోతున్నారనే చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న కామెంట్స్.. వరుసగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రం…