* గుంటూరు: నేడు తెనాలిలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. తెనాలి మార్కెట్ యార్డ్‌లో వైఎస్సార్ రైతు భరోసా మూడవ విడత నిధులను బటన్ నొక్కి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న సీఎం జగన్.. పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ * నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి.. ఎల్లారెడ్డి పేటలో ఏర్పాటు చేసిన వృద్ధుల సంక్షేమ కేంద్రం ప్రారంభించనున్న కేటీఆర్.. విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ…
Minister Botsa Satyanarayana: ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంపై దృష్టి సారించింది అన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలోని ఆంధ్ర లయోల కాలేజిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థుల ప్రతిభను గుర్తించాలని ఉపాధ్యాయులను కోరారు.. ఈ ప్రభుత్వం విద్యార్థుల కోసం చేసే ఆలోచనను విద్యార్థులు గుర్తించాలన్న ఆయన.. రాబోయే కాలంలో…
Gannavaram to Shirdi: షిర్డీ సాయిబాబాను దర్శించుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు.. రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు బస్సులు, రైళ్లలో మాత్రమే షిర్డీకి వెళ్లే అవకాశం ఉంది.. త్వరలోనే విమానాల్లో కూడా షిర్డీ వెళ్లే అవకాశం దక్కనుంది.. విజయవాడ సమీపంలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షిర్డీకి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.. మార్చి 26వ తేదీ నుంచి ఈ సర్వీసులు స్టార్ట్ కాబోతున్నాయట.. ఈ సర్వీసులను నడిపేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ముందుకు రావడంతో పాటు ప్రయాణ…
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. తప్పుడు కేసులు బనాయించి ప్రజాప్రతినిధులను, నేతలను వేధింపులకు గురిచేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.. అయితే, ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది.. అయితే, ఈ కేసులో సంచలన వాఖ్యలు చేశారు బీజేపీ తెలంగాణ నేత, మాజీ ఎంపీ వివేక్.. ఇవాళ తిరుమలలో శ్రీవారి దర్శించున్న ఆయన..…
Somu Veerraju: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. తిరుపతిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నిస్పక్షపాతంగా జరుగుతోందన్నారు.. అయితే, ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం ఎవ్వరినీ కాపాడదు అని.. సీబీఐ తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.. ఇక, వెయ్యి కోట్ల రూపాయలు…
YS Jagan Tenali Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు.. నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ సంబంధించిన నిధులను విడుదల చేస్తారు. ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారంచుడతారు.. ఇక, ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది సీఎంవో.. ఈ నెల 28వ తేదీన అనగా మంగళవారం రోజు ఉదయం 9.50 గంటలకు తేడాపల్లిలోని…
Exxeella Education Group: విజయవాడలో ఈ నెల 26వతేదీన ఆదివారం Exxeella Education Group ఆధ్వర్యంలో ఇంటర్నేషల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ జరిగింది.. నగరంలో గల ఫార్చ్యూన్ మురళి పార్క్ హోటల్ నందు నిర్వహించారు.. దీనిలో 30కి పైగా అంతర్జాతీయ యూనివర్సిటీ ప్రతినిధులు హాజరు కాగా ముఖ్య అతిథిగా హీరో సుహస్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఫెయిర్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫెయిర్ ను నిర్వహిస్తున్న ఎక్సల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ వారికి అభినందనలు తెలియచేస్తూ…
Ayyanna Patrudu: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.. అయ్యన్నపాత్రుడుపై ఫోర్జరీ కేసు దర్యాప్తుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.. ఈ కేసులో జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.. ఫోర్జరీ సెక్షన్లు ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.. కేసు దర్యాప్తు సమయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై…
Minister Peddireddy Ramachandra Reddy: మనం పార్టీ కోసం శ్రమిస్తే, మన కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత కృషి చేస్తారని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అనంతపురంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుల పరిచయ కార్యక్రమంలో మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసిన పాల్గొన్న రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పార్టీ కోసం కృషి…
YSR Village Clinics: ఎన్నో సంక్షేమ పథకాలతో అందరికీ లబ్ధి చేకూరేలా చూస్తుంది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సేవలపై ప్రశంసలు కురిపించింది కేంద్ర ప్రభుత్వం.. ఏపీలోని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) నిరంతర సేవలతో అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నాయంటూ పార్లమెంట్‌కు వెల్లడించింది కేంద్రం… రాష్ట్రంలో నూటికి నూరు శాతం గ్రామీణ పీహెచ్‌సీలు 24 గంటలూ పని చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలు వందకు…