What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీలో మధ్యాహ్నం జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్న కవిత.. రేపు మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత
* నేటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు
Also Read
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
* కామారెడ్డి: నేడు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. నిజాంసాగర్ మండలం గోర్గల్ వద్ద మంజీర నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవం.. జక్కాపూర్ వద్ద నాగమడుగు ఎత్తిపోతలకు శంఖుస్థాపన.. పిట్లం జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభ..
* అమరావతి: రెండో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికశాఖ మంత్రి బుగ్గన
* ప్రకాశం : కొనకనమిట్ల మండలం వెలుగొండ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు.. మూడు రోజుల పాటు కార్యక్రమాలకు భారీగా తరలిరానున్న భక్తులు..
* ప్రకాశం: ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షలు.. పరీక్షలకు మొత్తం 58,945 మంది విద్యార్థులు.. ఫస్టియర్ విద్యార్థులు 27,989 మంది.. సెకండ్ ఇయర్ విద్యార్థులు 30,956 మంది.. పరీక్షల నిర్వహణ కోసం 95 సెంటర్ల ఏర్పాటు.. నిమిషం లేటైనా విద్యార్థులను కేంద్రంలోకి నో ఎంట్రీ..
* ఏలూరు జిల్లా: నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.. జిల్లాలో పరీక్షకు హాజరు కానున్న 33,874మంది ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు.. జిల్లా వ్యాప్తంగా 106పరీక్షా కేంద్రాల ఏర్పాటు.. నో సెల్ ఫోన్ జోన్ గా పరీక్షాకేంద్రాలు.. పరీక్షాకేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు.. 8:30నిమిషాలకు విద్యార్ధులు పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలి..
* విశాఖ: నేటి నుంచి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ శిక్షణ తరగతులు.. పాల్గొననున్న పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు., ఏఐసీసీ సెక్రెటరీలు….
* కడప : పులివెందులలో నేడు వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి వేడుకలు.. హజరు కానున్న కుటుంబ సభ్యులు..
* కడప : కడప – నంద్యాల మధ్య నడిచే డెమో రైలు రెండు రోజులు రద్దు.. రైలు నిర్వహణా చర్య ల్లో భాగంగా నేడు, రేపు డెమో రైలు రద్దు చేసిన అధికారులు..
* తూర్పుగోదావరి జిల్లా : నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు.. ఉమ్మడి తూ.గో. జిల్లాలో 140 కేంద్రాల్లో 1,02,643 విద్యార్థులు హాజరు… ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష..
* తూర్పుగోదావరి జిల్లా : నేటి నుండి రాజమండ్రి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మాస్టర్ ప్లాన్ విస్తరణ పనులు ప్రారంభం.. మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్న కమీషశర్ దినేష్ కుమార్
* నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర చేనేత ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించనున్న కలెక్టర్ చక్రధర్ బాబు
* నెల్లూరులోని పుర మందిరంలో త్యాగరాజ స్మరణోత్సవాల సందర్భంగా కళాకారులతో త్యాగరాజ కీర్తనల ఆలాపన
* నెల్లూరు: చిల్లకూరు మండలం తూర్పు కనుమూరులో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర
* ఈ నెల 26న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV మార్క్-3 రాకెట్ ప్రయోగం.. యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్న శాస్త్రవేత్తలు
* విశాఖ: ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఉమ్మడి జిల్లా పరిధిలో 128కేంద్రాలు ఏర్పాటు.. నేడు పరీక్షకు హాజరుకానున్న 1 లక్ష 13వేల251మంది విద్యార్థులు
* అనంతపురం : నేటి నుంచి ఇంటర్ పరీక్షలు.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 99 పరీక్షా కేంద్రాలు. హాజరు కానున్న 63,090 మంది విద్యార్థులు.
* తిరుపతి : నేడు నగరంలోని రెండు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్… శాసన మండలి ఎన్నికల్లో భాగంగా తిరుపతి నగరంలో చిన్నబజారు వీధిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గల పోలింగ్ బూత్ నెంబర్ 229, అలాగే సత్యనారాయణ పురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల పోలింగ్ బూత్ నెంబర్ 233లో రిగ్గింగ్ జరిగినట్లు నిర్ధారణ… పోలింగ్ ప్రక్రియ ఆపి కేసులు నమోదు చేయడం తో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రీపోలింగ్ కు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హరినారాయణ ఆదేశాలు.. నేడు రెండు భూతు ల్లో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రీ పోలింగ్..
* గుంటూరు: నేటి నుండి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 134 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. పరీక్షలు రాయనున్న 47,082 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 47,893 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు….
* నేడు గుంటూరు జిల్లా తెనాలిలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన.. పెమ్మసాని థియేటర్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు,ఎన్టీఆర్ అవార్డుల ప్రధాన వేడుకలో పాల్గొననున్న నందమూరి బాలకృష్ణ..
* కర్నూలు: నేడు కోడుమూరు మండలం గోరంట్ల శ్రీ లక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాలలో హంసవాహనం, చక్రస్నానం, వసంతోత్సవం, కంకణ విసర్జన.. నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
* అనంతపురం : రేపు పశ్చిమరాయలసీమ పట్టభద్రుల,ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ . పట్టభద్రుల ఓట్ల లెక్కింపుకు 24 టేబుళ్లు. ఉపాధ్యాయ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు. ఓట్ల లెక్కీంపునకు మూడు బ్యాచ్ లు ఏర్పాటు. కౌంటింగ్ కేంద్రం జేఎన్టీయూ వద్ద 144 సెక్షన్ . సీసీ కెమెరాల ద్వారా పోలీసుల నిఘా.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నేటి నుండి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు.. జిల్లావ్యాప్తంగా 35 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసిన జిల్లా అధికార యంత్రాంగం.. జిల్లా వ్యాప్తంగా 10363 ప్రథమ సంవత్సరం విద్యార్థులు, 9504 ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
* ఖమ్మం జిల్లాలో ఇంటర్ పరీక్ష కోసం 63 కేంద్రాలు.. మొదటి సంవత్సరం 17,899 మంది, ద్వితీయ సంవత్సరం 17,967 మంది హాజరు కానున్నారు
* కర్నూలు: కృష్ణగిరి మండలం కోయిలకొండలో ఉగాది పండుగ సందర్భంగా నేటి నుండి జిల్లాస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు…
* కర్నూలు: నేడు మద్దికేరలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు ,మహా మంగళారతి, తులసి అర్చన, పల్లకి సేవ ప్రత్యేక పూజలు
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
-
Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్‌కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!