ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది.. రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఉన్న గ్రామ పంచాయితీ కార్యాలయాలను గ్రామ సచివాలయాలుగా మార్చారు.. కొన్ని ప్రాంతాల్లో కొత్త భవనాల నిర్మాణం జరిగింది.. మరికొన్ని చోట్ల అద్దె భవనాల్లోనే గ్రామ సచివాలయాలను నిర్వహిస్తున్నారు. అయితే, అద్దె చెల్లించని కారణంగా సచివాలయ కార్యాలయానికి తాళం వేశాడు.. ఆ ఇంటి యజమాని.. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. అయితే, దీనికి సంబంధించిన కొన్ని షరతులు విధించింది.. ఏపీ ఐ అండ్ పీఆర్ కమిషనర్ విధించిన షరతులకు లోబడి ప్రతిపాదనను సిఫార్సు చేయనున్నారు..
పల్నాడు జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజనీ, అలీ పాల్గొన్నారు. అందులో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీలను భుజం తట్టి నడిపిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను రాష్ట్రానికి నాలుగు దిక్కులుగా సీఎం జగన్ భావిస్తారని తెలిపారు. అలాంటి జగన్ ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే బాధ్యత అణగారిన వర్గాలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.
పల్నాడు జిల్లాలో సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి వెంకటరమణారావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్ వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.... 2024లో జగనే మళ్లీ సీఎం కావాలని అన్నారు. జగన్ సీఎం అయితేనే ప్రతి పేదవాడి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారని తెలిపారు. జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతాయి.. గడిచిన నాలుగు ఏళ్లుగా జగన్ చేసిన మేలు ప్రజలు గుర్తుపెట్టుకుంటారన్నారు.
పురంధేశ్వరి.. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వచ్చిందన్నారు.. కానీ, ఇప్పుడు ఆ గౌరవం పోవడమే కాదు.. బీజేపీలోనే ఆమెకు మద్దతు లేదన్నారు. ఈ మాత్రం దానికి బీజేపీ అధ్యక్షురాలుగా ఉండటం ఎందుకు? టీడీపీలో చేరితే సరిపోతుంది కదా? అని ప్రశ్నించారు మంత్రి అప్పలరాజు.