సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు వైవీ సుబ్బారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే సీఎం జగన్ టికెట్లు కేటాయిస్తారన్న ఆయన.. ప్రజలకు చేసిన కార్యక్రమాలు చూసి మరోసారి ఆశీర్వదించాలని సీఎం జగన్ ప్రజలను కోరుతున్నారు అన్నారు.
ఏపీలో రేపటి నుంచి కుల గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు 5 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కులగణన స్టార్ట్ చేయనున్నారు. 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో మొదలు కానుంది.
ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ - జనసేన పార్టీల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు.. 14, 15, 16 తేదీల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.. నియోజకవర్గ స్థాయిలో ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు.. ఇక, ఈ నెల 17వ తేదీ నుంచి చేపట్టే ఇంటింటి ప్రచారంపై సమీక్ష చేపట్టనున్నారు నేతలు.